logo

రాక్షస పాలనకు త్వరలో తెర

రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 04:26 IST

ఆకివీడు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఆకివీడు మండల పరిధిలో ఆయన శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. పెదకాపవరం గ్రామంలో ప్రారంభించిన ప్రచార యాత్ర చినకాపవరం, అప్పారావుపేట, గుమ్ములూరు, తరటావ, కోళ్లపర్రు, రాజులపేట, చినమిల్లిపాడు, కళింగగూడెం, సిద్ధాపురం వరకు కొనసాగింది. ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం), జుత్తిగ నాగరాజు పాల్గొన్నారు. ప్రచార రథం, ద్విచక్ర వాహనంపై, కాలినడకన ప్రయాణిస్తూ పలు గ్రామాల్లో ప్రజలను కలిసి మాట్లాడారు. కూటమి నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. గుమ్ములూరులో కోపల్లె సాయిబాబా నివాసం ఆవరణలో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ‘జగనాసుర రక్త చరిత్ర’ కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు.  


ఉండి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా కృషి చేస్తామని తెదేపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి అన్నారు. ఉండిలో నిమ్మనపేట, బాలాజీరావుపేట, కొత్తపేట, కళింగపేటల్లో పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, కాగిత బుజ్జిల నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు.


ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు ఎస్‌ కూడలి వద్ద ఉన్న పార్టీ భవనంలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.  దీనిని కూటమి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం పొందారు. తెదేపా ఆకివీడు పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, నాయకులు కిమిడి నాగరాజు, మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని