logo

కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి

జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు.

Published : 27 Apr 2024 04:31 IST

ఆర్డీవో చొరవతో స్పందించిన రైల్వేశాఖ
నెలకు రూ.10 వేలు ఇచ్చేలా ఏర్పాట్లు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. ఆకివీడుకు చెందిన వృద్ధురాలు పొన్నమండ విజయలక్ష్మి బాగోగులను ఎవరూ చూడకపోవడంతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. జీవనం కష్టంగా ఉంది.. న్యాయం చేయాలంటూ ఆమె సమస్యను ఇటీవల ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందించి సౌత్‌కోస్ట్‌ ఈస్టర్న్‌ రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్న ఆమె కుమారుడ్ని సంప్రదించారు. అతడి నుంచి స్పందన లేకపోవడంతో రైల్వే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అతడి జీతం నుంచి తల్లికి జీవన భృతిగా నెలకు రూ.10 వేలు ఇవ్వాలని దానిలో కోరారు. దీనిపై రైల్వే ఉన్నతాధికారులు స్పందించారని వెల్లడించారు. ఈ మేరకు వారు పంపిన తొలి చెక్కును తన కార్యాలయంలో విజయలక్ష్మికి శుక్రవారం అందజేశారు. వయోవృద్ధుల ట్రిబ్యునల్‌ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు