logo

చరిత్ర పుటలో.. నందనం తోట

జాతిపిత మహాత్మాగాంధీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఎందరో స్వాతంత్య్ర సమరంలో భాగస్వాములయ్యారు. ఉయ్యూరు ఎస్టేట్‌ జమీందారు రాజా రంగయ్య అప్పారావు కుమారుడు వేంకటాద్రి అప్పారావు ఆహ్వానం

Published : 10 Aug 2022 04:52 IST

నూజివీడులో  మండపం

నూజివీడు, న్యూస్‌టుడే: జాతిపిత మహాత్మాగాంధీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఎందరో స్వాతంత్య్ర సమరంలో భాగస్వాములయ్యారు. ఉయ్యూరు ఎస్టేట్‌ జమీందారు రాజా రంగయ్య అప్పారావు కుమారుడు వేంకటాద్రి అప్పారావు ఆహ్వానం మేరకు 1929లో గాంధీజీ నూజివీడును సందర్శించారు. ఆయనకు గాంధీనగర్‌లో నిర్మించిన ఓ మండపం పక్కన ఏర్పాటు చేసిన కుటీరంలో బస ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి ‘నందనం తోట’ అని గాంధీజీ నామకరణం చేశారు. స్థానిక పుర మందిరం(నేటి టౌన్‌ హాల్‌) వద్ద వేంకటాద్రి అప్పారావు ఆధ్వర్యంలో విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రసంగించారు. గాంధీజీ ప్రసంగాన్ని వినడానికి ఎడ్ల బండ్లపై ప్రజలు తరలివచ్చారు. ఈ సమయంలోనే వేంకటాద్రి అప్పారావు కుమారుడు ఎంఆర్‌ అప్పారావు (మాజీ మంత్రి) తాను ఖద్దరు మాత్రమే ధరిస్తానని ప్రతిన బూనారు. దానిని చివరి శ్వాస వరకు పాటించారు. అనంతరం గాంధీజీ హనుమాన్‌ జంక్షన్‌ వెళుతుండగా నూజివీడు మండలం గొల్లపల్లి ఎస్టేట్‌ జమీందారు శ్రీమన్నారాయణ అప్పారావు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు నాటి గ్రామ పంచాయతీ తీర్మానాన్ని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని