logo

ఇటు భోజనాలు... అటు సొమ్ములు

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. సామాన్య ప్రజలతోపాటు వివిధ వర్గాలను ప్రభావితం చేసేలా చిరుదోగ్యులపై దృష్టి సారించింది.

Published : 06 May 2024 05:16 IST

ఎన్నికల వేళ అధికార పార్టీ ప్రలోభాల వల

మార్టేరు, న్యూస్‌టుడే: పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. సామాన్య ప్రజలతోపాటు వివిధ వర్గాలను ప్రభావితం చేసేలా చిరుదోగ్యులపై దృష్టి సారించింది. ఆచంట నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం గ్రామస్థులందరికీ భోజనాలు పెట్టే ప్రక్రియ జోరుగా సాగుతుంది. పెనుమంట్ర మండలంలో ఆదివారం పక్కపక్కనే ఉన్న రెండు గ్రామాల్లో ఉదయం, రాత్రి వేళల్లో భోజనాలు ఏర్పాటు చేసి వారికి సకల మర్యాదలు చేసి పంపించారు. ఇక డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను చూసే వీవోఏలకు డబ్బులు ఎరవేస్తున్నారు. తూర్పుపాలెంలో జరిగిన ఆసరా కార్యక్రమానికి మహిళలను తరలించడంలో కీలకపాత్ర వహించిన వీరిని నాటి నుంచి విస్మరించడంతో గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీవోలను ప్రసన్నం చేసుకుని డ్వాక్రా మహిళల ఓట్లు పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంలో కొన్ని గ్రామాల్లో రూ.5వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో తమకు అనుకూలంగా పనిచేయాలని నాయకులు బెదిరించడం, ఆశించిన మేర సొమ్ము ఇవ్వకపోవడంతో వారి ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. వాలంటీరుగ్లా పనిచేసి రాజీనామా చేసి పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న వారికి స్థానిక నాయకులు వారి అవసరాలకు సొమ్ములు ఇచ్చి  ఆకట్టుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని