logo

తపాలా ఓట్ల కోసం పోటా పోటీ

ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుండటంతో తపాలా ఓట్లను దక్కించుకొనేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్‌ ఓటింగ్‌ జరగనుంది.

Published : 06 May 2024 05:17 IST

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుండటంతో తపాలా ఓట్లను దక్కించుకొనేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్‌ ఓటింగ్‌ జరగనుంది. దీనికి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బంది వివరాల జాబితాలను వివిధ పార్టీలు ఇప్పటికే సేకరించడంతో పాటు సంప్రదింపులు కూడా పూర్తి చేశారు. ఈ సారి ఉద్యోగుల ఓట్లు వచ్చే అవకాశం తక్కువ అని భావించిన ప్రధాన పార్టీ అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే తొలుత సంప్రదించినట్లు సమాచారం. మరో ముఖ్య పార్టీ నాయకులు ఎంత సొమ్ము ఇచ్చారో తెలుసుకున్న తర్వాత వారి కంటే ఎక్కువ ఇచ్చి ఎక్కువ మందిని తమవైపు తిప్పుకొనే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో నగదుకు బదులు బహుమతులు ఇచ్చే యత్నాలూ కొనసాగుతున్నాయి.

అంతా హడావుడి.. తపాలా బ్యాలెట్‌పై కొందరు ఉద్యోగులకు సకాలంలో సమాచారం అందలేదు. దీంతో గడువు సమీపించాక ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అంగన్‌వాడీ సిబ్బందికి చివరిలో సమాచారం ఇచ్చారు. వారిలో 55 ఏళ్లు దాటిన, అనారోగ్య సమస్యలు ఉన్న వారిని మినహాయించి మిగిలిన వారికి ఎన్నికల విధులు కేటాయించారు. సచివాలయ ఉద్యోగుల విషయంలోనూ ఇంచుమించు అలాగే జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని