logo

పేద విద్యార్థులకు ఉచిత విద్య

ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు స్పృహ ఎడ్యుకేషనల్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎ.సర్వేశ్వరరావు తెలిపారు.

Published : 07 May 2024 05:42 IST

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు స్పృహ ఎడ్యుకేషనల్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎ.సర్వేశ్వరరావు తెలిపారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ కేజీబీవీ పాఠశాలల సంచాలకుడు డి.మధుసూదనరావు సారథ్యంలో ఏర్పడిన ట్రస్ట్‌ ద్వారా ఉచిత విద్య అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ నెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం ఏలూరు జిల్లా విద్యార్థులు 94408 28661, పశ్చిమగోదావరి జిల్లా వారు 63028 78872 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని