logo

జగన్‌ వస్తే పెట్రోలు సరఫరా ఉండదట!

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు.

Published : 07 May 2024 06:03 IST

నరసాపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పెట్రోలు బంకులకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డీజిల్‌, పెట్రోలు సరఫరా ట్యాంకర్ల రవాణా కూడా నిలిచిపోనుంది. ఈ మేరకు  బంకుల యజమానులకు పెట్రోలియం కంపెనీల నుంచి సమాచారమిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం మధ్యాహ్నం నుంచి టెర్మినల్స్‌ యథావిధిగా పనిచేస్తాయని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని