logo

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్‌ తెలిపారు.

Published : 18 May 2024 04:21 IST

చైతన్యబాబు (పాత చిత్రం)

పెదపాడు, న్యూస్‌టుడే: పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పండు చైతన్యబాబు(28) గ్రామంలోని మంతెన శివప్రసాదరాజుకు చెందిన చేపల చెరువుకు కాపలాదారుగా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చెరువు గట్టుపై  విద్యుత్తు తీగ తెగిపడి ఉండటాన్ని గమనించక కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కొనికి వీఆర్వో అల్లు వీరవెంకట వరప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బాలసాయి (పాత చిత్రం)

ముదినేపల్లి, న్యూస్‌టుడే: రొయ్యల చెరువుపై పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఇది. స్థానికుల కథనం ప్రకారం.. ముదినేపల్లిలో రొయ్యల చెరువుపై కోల్‌కతాకు చెందిన షైపుల్లా, ముదినేపల్లి మండలం అన్నవరానికి చెందిన బొర్రా బాలసాయి(22) పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం స్విచ్‌ వేస్తుండగా షైపుల్లా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడ్ని కాపాడే క్రమంలో అక్కడే ఉన్న బాలసాయి దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందగా, షైపుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు