logo

భగ్గుమన్న ఉద్యోగులు!

ఉద్యోగులు, పింఛను దారులకు నష్టం చేకూర్చేలా ఉన్న 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, పోలవరం, తణుకు తదితర ప్రాంతాల్లో గురువారం ఆందోళనలు,

Published : 21 Jan 2022 05:20 IST

కొయ్యలగూడెంలో ఆందోళన చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది

ఉద్యోగులు, పింఛను దారులకు నష్టం చేకూర్చేలా ఉన్న 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, పోలవరం, తణుకు తదితర ప్రాంతాల్లో గురువారం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పలు చోట్ల జీవో ప్రతులకు దహనం చేశారు. పీఆర్సీల చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. వీరికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి. - న్యూస్‌టుడే, నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు, పోలవరం, తణుకు

ఏలూరులో గృహ నిర్బంధంలో ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ హరనాథ్‌

నాయకుల గృహ నిర్బంధం

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: కొత్త పీఆర్‌సీ జీవోలపై నిరసన కార్యక్రమానికి వెళ్లనీయకుండా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్‌ ఆర్‌.ఎస్‌. హరనాథ్‌, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణను ఏలూరులో, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గోపిమూర్తిని భీమవరంలో గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో గురువారం నిర్వహించిన ఐకాస రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వీరికి అవకాశం లేకుండా చేశారు.

కలెక్టరేట్‌ వద్ద ....

పోలీసుల మోహరింపు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో పోలీసులు ఎక్కడికక్కడ మోప ారించారు. పాతబస్టాండ్‌ సెంటరు, తంగెళ్లమూడి, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్‌ వద్ద ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశాల మేరకు ఏలూరు ఏఎస్పీ, ఏలూరు ఇన్‌ఛార్జి డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగ సంఘాల నేత హరినాథ్‌ను ఆయన నివాసం వద్ద పోలీసులు గృహ నిర్బంధం చేయటంతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

ఐటా మద్దతు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఫ్యాప్టో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడికి ఆల్‌ ఇండియా ఐడియల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఐటా) సంపూర్ణ మద్దతు తెలిపింది. ముట్టడిలో ఐటా రాష్ట్ర అధ్యక్షుడు యస్‌. అబ్దుల్‌ రజాక్‌, జిల్లా అధ్యక్షుడు రిజ్వాన్‌ అహమ్మద్‌, కార్యదర్శి యం.డి.ముజాహిద్‌ పాల్గొన్నారు.

అరెస్టులు అప్రజాస్వామికం

ఏలూరు టూ టౌన్‌, న్యూస్‌టుడే: న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలటూ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టులు చేయటం అప్రజాస్వామ్యకమని పంచాయితీరాజ్‌ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు జి శ్రీధర్‌ రాజు, కార్యదర్శి గోపాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పీఆర్‌సీ 2020 ప్రక్రియలో పాల్గొనొద్దు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీటీఎస్‌ఏ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పీఆర్‌సీ 2020 ప్రక్రియలో ఖజానా ఉద్యోగులు పాల్గొనరాదని జిల్లా అధ్యక్షుడు యు.వి. పాండురంగారావు, కార్యదర్శి కె. సత్యనారాయణ ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర సంఘానికి మద్దతుగా ఒకే మాట ఒకే బాటగా ఉండాలని, అధికారుల నుంచి ఏవిధమైన ఒత్తిడి వచ్చిన జిల్లా నాయకత్వానికి తెలియచేయాలని కోరారు.

నరసాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

పాలకొల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పింఛనుదారుల సంఘ సభ్యుల..

కొవ్వూరులో జీవో ప్రతుల దహనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని