సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్‌ను గొడ్డలితో నరికినా పట్టదా?

‘సీఎం జగన్‌పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 25 Apr 2024 08:47 IST

రోడ్డుషోలో మాట్లాడుతున్న వివేకా కుమార్తె సునీత, చిత్రంలో తులసిరెడ్డి తదితరులు

లింగాల, న్యూస్‌టుడే : ‘సీఎం జగన్‌పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని వెలిదండ్ల, పార్నపల్లె, కోమన్నూతల, కుందిలిచెర్లోపల్లె, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, గుణకనపల్లె, రామన్నూతలపల్లె, చిన్నకుడాల తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివేకా హత్యకేసులో న్యాయం కోసం అయిదేళ్లుగా పోరాడుతున్నానని, మీరైనా న్యాయం చేయండని ప్రజలను కోరారు. మీ బిడ్డకు అన్యాయం జరిగిందని, మీ దీవెనలు..ఆశీస్సులు కావాలన్నారు. హంతకులకు ఓటేయొద్దని పేర్కొన్నారు. కడప ఎంపీగా వైఎస్‌ షర్మిలను గెలిపించుకుంటే వివేక హత్య కేసుతో పాటు మన కష్టాలను పార్లమెంటు వరకు తీసుకెళ్తుందన్నారు. రోడ్డుషోలో పులివెందుల కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువకుమార్‌రెడ్డి, పీసీసీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి, నాయకులు నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, బోనాల బాబురెడ్డి, యమ్మనూరు మనోహరరెడ్డి పాల్గొన్నారు.      

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు