ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు

నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 04 May 2024 05:32 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఈనాడు, అమరావతి: నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వృద్ధుల పింఛను బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పి.. రకరకాల కారణాలతో ఛార్జీలు వసూలు చేయడం అమానుషం. ఎలాంటి బ్యాంకు ఛార్జీలు వసూలు చేయకూడదు. వసూలు చేసిన మొత్తాన్ని లబ్ధిదారులకు తిరిగి ఇచ్చేయాలి. పింఛనుదారుల ఖాతాలతో లావాదేవీలు జరగడం లేదని, కనీస నిల్వలూ లేవనే కారణాలతో రూ.300 నుంచి రూ.400 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అలసత్వం వల్ల పండుటాకులు ఆర్థికంగా నష్టపోతూ.. ఎండ వేడికి తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం. ఒకవైపు భాజపా బ్యాంకు ఛార్జీల పేరుతో వృద్ధుల సొమ్ము జమ చేసుకుంటుంటే మరోవైపు వైకాపా ఈ పరిణామాల్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది’’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని