జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం

పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది.

Published : 04 May 2024 05:33 IST

అంబటి ఇలాకాలో వైకాపా మాజీ నేత వెల్లడి

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో గోపాలరావు అన్న భార్య చంద్రకళను వైకాపా తరఫున జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీలో నిలిపి గెలిపించారు. అప్పట్లో గోపాలరావు సొంతంగా ఖర్చు చేశారు. టికెట్‌ ఇచ్చినందుకు మంత్రి అంబటి రాంబాబుకు డబ్బు ఇచ్చారన్న ప్రచారం జరిగింది. గురువారం గోపాలరావు వైకాపాను వీడి సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ నేపథ్యంలో కొందరు వైకాపా కార్యకర్తలు ఆయనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన ఆయన ‘మీరు ఊహించిన దాని కంటే ఎంతో ఖర్చు పెడితేనే జడ్పీటీసీ పదవి వచ్చింది. అందరూ నిజాలు తెలుసుకోవాలి’ అని పోస్టు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని