logo

పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో

చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

Published : 17 May 2024 03:20 IST

13 మంది కడప కేంద్ర కారాగారానికి తరలింపు

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే : చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. వీరిలో ప్రధాన నిందితులైన భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితో పాటు మరో 11 మందిని  ప్రత్యేక బందోబస్తు మధ్య కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నెల 14న తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్‌ గదుల పరిశీలనకు వెళ్లి నానిపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడి ఆయనపై హత్యాయత్నం చేయడంతో పాటు వాహనాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నాని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను తిరుపతి ఏడీజే కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. ఈ మేరకు నిందితులను గురువారం సాయంత్రం కడప కేంద్రకారాగారానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని