logo

ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం

ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు.

Published : 17 May 2024 03:23 IST

అడుగంటుతున్న గండికోట జలాశయంలోని నీటిమట్టం

కొండాపురం, న్యూస్‌టుడే: ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. అనంతరం 2015లో 5.5 టీఎంసీలు, 2017లో 8, 2018లో 12, 2020, డిసెంబరులో ఏకంగా 26.85 టీఎంసీలు నిల్వ చేశారు. 2021 నుంచి 2023 వరకు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అనంతరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు నీటిని తరలించడంతో జలాశయంలో డెడ్‌ స్టోరేజీ (కనిష్ఠ స్థాయి)కి నీరు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు