logo
Updated : 04/12/2021 01:15 IST

ఠాణాలోనే అనిశాకు చిక్కిన కానిస్టేబుల్‌


అంజిలయ్య

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ఠాణాలో లంచం తీసుకుంటూ ఓ క్రైం కానిస్టేబుల్‌ అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కాడు. ఈ ఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మొయినాబాద్‌ ఠాణాలో చోటు చేసుకుంది. అనిశా డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లకు చెందిన కొమ్ము అంజిలయ్య(36) మూడున్నరేళ్లగా మొయినాబాద్‌ ఠాణాలో క్రైం కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుత్బుద్దిన్‌గూడకు చెందిన అబ్దుల్‌ రహీం 2019లో ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లిన సమయంలో పోలీసులు అతని ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశారు. కోర్టు నుంచి ద్విచక్ర వాహనం విడుదలకు అనుమతి తెచ్చుకున్నాడు. కోర్టు ఉత్తర్వులతో అంజిలయ్యను రహీం సంప్రదించారు. వాహనం ఇవ్వాలంటే తనకు రూ.15వేలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పాడు. దీంతో బాధితుడు అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం రాత్రి పోలీసు స్టేషన్‌లోనే అబ్దుల్‌ రహీం నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అంజిలయ్యను అనిశా అధికారులు పట్టుకున్నారు. మొయినాబాద్‌లోని అతని నివాసంలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

ఎస్సైకి మొరపెట్టుకున్నా..
బాధితుడు అబ్దుల్‌ రహీం జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి క్రైం కానిస్టేబుల్‌ అంజిలయ్య వేధింపులకు గురిచేస్తున్నాడు. గతంలో రూ.2వేలు సమర్పించుకున్నాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఓ ఎస్సైని కలిసి కానిస్టేబుల్‌ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మొరపెట్టుకున్నారు. అప్పటి నుంచి వేధింపులు మరింత పెరిగాయి. ఇదే సమయంలో తన ద్విచక్ర వాహనాన్ని ఇచ్చేందుకూ సతాయిస్తుండటంతో అనిశాను ఆశ్రయించాడు. అంజిలయ్య 2012లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. కేపీహెచ్‌బీ ఠాణాలో మూడు నెలలు పనిచేసిన అనంతరం నార్సింగి ఠాణాలో విధులు నిర్వర్తించాడు. మూడున్నరేళ్ల క్రితం మొయినాబాద్‌ ఠాణాకు వచ్చాడు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని