icon icon icon
icon icon icon

Amit shah: కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చింది: అమిత్‌షా

కేసీఆర్‌ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు.

Updated : 26 Nov 2023 13:04 IST

మక్తల్‌: కేసీఆర్‌ పదేళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించేవని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్‌లో నిర్వహించిన భాజపా సభలో ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో భారాస పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రుల భూ కబ్జాలకు అడ్డులేకుండా పోయింది. ప్రజల పనులు చేయకుండా దందాలు చేయడమే ఆ పార్టీ ఎమ్మెల్యే విధానం. ఈ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే మక్తల్‌, నారాయణపేటలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తాం. భారాసకు కాంగ్రెస్‌ బీ టీమ్‌లాంటిది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వల్లే కాళేశ్వరంలో ప్రాజెక్టు కుంగిపోయింది. కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే సమయం వచ్చింది. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు భారాసకు అమ్ముడుపోతారు. రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం అభివృద్ధి చెందలేదు. మత్స్యకారుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి నిధులిస్తాం’’అని అమిత్‌షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img