icon icon icon
icon icon icon

JP Nadda: 9 ఏళ్లలో ఎన్ని డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇచ్చారు?: జేపీ నడ్డా

దళితబంధులో కూడా భారాస నేతలు కమీషన్లు తీసుకున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. 

Published : 19 Nov 2023 16:23 IST

చేవెళ్ల: దళితబంధులో కూడా భారాస నేతలు కమీషన్లు తీసుకున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆదివారం చేవెళ్లలో నిర్వహించిన భాజపా సకల జనుల సంకల్ప సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించారు. ‘‘ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణలో రూ.5 లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టింది. రాష్ట్రంలో భాజపా గెలిస్తే ఉజ్వల్‌ వినియోగదారులకు ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తాం. భారాస ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో ఎంత మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చిందో ఆలోచించాలి. మోదీ పాలనలో భారత్‌ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీ వ్యక్తిని సీఎంగా చేస్తాం. భాజపాను గెలిపిస్తే వరికి రూ.3100 మద్దతు ధర కల్పిస్తాం. ఎరువుల కోసం రూ.2,100 ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తాం. మహిళా సంఘాలకు 1 శాతం వడ్డీకే రుణాలు ఇస్తాం’’ అని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img