icon icon icon
icon icon icon

Telangana Elections: గులాబీ కండువాతో ఓటు.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు

భారాస అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (Indrakaran Reddy)పై కేసు నమోదైంది. (Telangana Elections 2023) ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు.

Updated : 30 Nov 2023 14:57 IST

నిర్మల్‌: భారాస అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (Indrakaran Reddy)పై కేసు నమోదైంది. (Telangana Elections 2023) ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మంత్రిపై కేసు నమోదైంది. 

మరోవైపు పటాన్‌చెరు కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ సతీమణి సుధ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించడంపై భారాస, బీఎస్పీ అభ్యంతరం తెలిపాయి. ముగ్గురు కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఇస్నాపూర్‌ పోలింగ్‌ కేంద్రానికి సుధ వెళ్లారు. దీంతో భారాస, బీఎస్పీ నేతలు ఆమెతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కలగజేసుకుని వారిని చెదరగొట్టారు. పోలింగ్‌ కేంద్రం చుట్టూ ఉన్నవారిని కూడా అక్కణ్నుంచి పంపించివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img