icon icon icon
icon icon icon

భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది

పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

Published : 16 May 2024 03:49 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని అబద్ధాలతో కలిపి భాజపా ప్రచారం చేస్తోందని బుధవారం ఆయన అమెరికా నుంచి పంపిన వీడియో సందేశంలో మీడియాకు తెలిపారు. ‘‘తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరవాత నుంచి ప్రధానమంత్రి పదవి స్థాయిని దిగజార్చేలా... ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతారని, అర్బన్‌ టెర్రరిజం వస్తుందని, మంగళసూత్రాలను తెంచుతారని మోదీ దుష్ప్రచారం చేస్తున్నారు. రాహుల్‌గాంధీ మాటలను వక్రీకరిస్తున్నారు. దేశంలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు’’ అని పొన్నం విమర్శించారు.

తెలంగాణలో భాజపాకు స్థానం లేదు: మల్లు రవి

తెలంగాణలో భాజపాకు స్థానం లేదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని,  భాజపా, భారాసలు కుమ్మక్కై లోపాయికారీ ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు పలికారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img