icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి విందు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్‌లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు.

Published : 17 May 2024 04:00 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్‌లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించాలని, ఎన్నికల తర్వాత మే 16న వారితో కలిసి భోజనం చేస్తానని, ఫొటోలు దిగుతానని మాటిచ్చారు. ఈ మేరకు... గురువారం మాదాపూర్‌లోని హోటల్‌ దస పల్లాలో వారికి లంచ్‌ ఏర్పాటు చేయించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img