icon icon icon
icon icon icon

భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది.

Published : 17 May 2024 04:02 IST

కాంగ్రెస్‌లో పాత, కొత్త నాయకుల మధ్య పూర్తిస్థాయిలో సమన్వయం జరగలేదు: పీసీసీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు 95 శాతం వరకు కాంగ్రెస్‌ పార్టీకే పడ్డాయని తెలిపింది. పాత, కొత్త నాయకుల మధ్య పూర్తిస్థాయిలో సమన్వయం జరగలేదని, సీపీఎం, సీపీఐ పార్టీలను ఆశించిన స్థాయిలో సమన్వయం చేసుకోలేకపోయిందని అభిప్రాయపడింది. గురువారం గాంధీభవన్‌లో కమిటీ కన్వీనర్‌ మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై రూపొందించిన మూడు పేజీల తుది నివేదికను ఈ సందర్భంగా కమిటీ సభ్యులు దీపా దాస్‌మున్షీకి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయంపై దృష్టి సారించాలని సూచించారు. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, వినోద్‌రెడ్డి, పుష్పలీల, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img