icon icon icon
icon icon icon

భారాసను కేసీఆర్‌ కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేస్తారు?

భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Published : 15 May 2024 03:49 IST

లక్ష్మణ్‌ వ్యాఖ్యలు అవగాహనారాహిత్యం: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరవచ్చేమో గాని.. పార్టీని కేసీఆర్‌ ఎందుకు విలీనం చేస్తారని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉందని, అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు సంక్షోభంలో పడుతుందని ప్రశ్నించారు. తమతో భారాస, భాజపాలకు చెందిన 20 మంది వరకు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు.  ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌తో చర్చకు రావాలని లక్ష్మణ్‌కు జగ్గారెడ్డి సవాల్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img