icon icon icon
icon icon icon

KTR: మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్‌ జీ?: కేటీఆర్‌

నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.

Published : 15 May 2024 14:28 IST

హైదరాబాద్‌: నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. నాగర్‌కర్నూలు భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్(ట్విటర్‌) వేదికగా చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్‌ జీ అని కాంగ్రెస్‌ అగ్రనేతను ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్‌ నేతలు అధికార దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ దాడులు, దుర్భాషల్లో పోలీసులు కూడా భాగస్వామ్యం కావడం సిగ్గుచేటన్నారు. దాడులకు పాల్పడిన గూండాలు, ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని.. లేకుంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img