icon icon icon
icon icon icon

ఎమ్మెల్యేలుగా బావ, బావమరది

మహబూబాబాద్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి మేనబావ, బావమరుదులు వరసగా వేర్వేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Published : 10 Nov 2023 11:46 IST

మహబూబాబాద్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి మేనబావ, బావమరుదులు వరసగా వేర్వేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కురవి మండలం కందికొండ గ్రామానికి చెందిన బండి పుల్లయ్య 1994లో సీపీఐ నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డిపై విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో పుల్లయ్య మేనమామ కుమారుడు పెద్దవంగరకు చెందిన శ్రీరాంభద్రయ్య తెదేపా నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వి.రాజవర్ధన్‌రెడ్డిపై గెలుపొందారు. వీరిద్దరు  ఒకే కళాశాలలో కలిసి చదువుకున్న సహచర విద్యార్థులు కూడా కావడం గమనార్హం.

- న్యూస్‌టుడే, మహబూబాబాద్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img