icon icon icon
icon icon icon

JP Nadda: మోదీ వల్లే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: జేపీ నడ్డా

ప్రధాని మోదీ వల్లే ఇవాళ భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా ఎదిగిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

Updated : 27 Nov 2023 14:59 IST

బోధన్‌: ప్రధాని మోదీ వల్లే ఇవాళ భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా ఎదిగిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో నడ్డా మాట్లాడారు. రైతులు, పేదలు, మహిళా విరోధి కాంగ్రెస్‌ పార్టీ అని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా దేశవ్యాప్తంగా పేదలు ఇల్లు నిర్మించుకుంటున్నారన్నారు. భారాస పాలనలో రాష్ట్రంలోని పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వచ్చాయా?తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయా? అని నడ్డా ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img