icon icon icon
icon icon icon

Smriti Irani: కారు కేసీఆర్‌ దగ్గర.. స్టీరింగ్‌ వేరే వాళ్ల చేతుల్లో: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

కేసీఆర్‌ దగ్గర కారు ఉంది కానీ, దాని స్టీరింగ్‌ మాత్రం వేరే వాళ్ల చేతుల్లో ఉందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఎద్దేవా చేశారు.

Published : 23 Nov 2023 19:05 IST

హైదరాబాద్‌: కేసీఆర్‌ దగ్గర కారు ఉంది కానీ, దాని స్టీరింగ్‌ మాత్రం వేరే వాళ్ల చేతుల్లో ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఆనందనగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. దళిత బంధు పథకంలో అసలైన లబ్ధిదారుల కంటే భారాస ఎమ్మెల్యేలే లబ్ధిపొందారని ఆమె విమర్శించారు. కరోనా నుంచి రెండున్నర ఏళ్ల పాటు అర్హులైన పేద వారందరికీ ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. కానీ, అదే కేంద్రంలో కాంగ్రెస్, భారాస, ఎంఐఎం ఉంటే ఇచ్చేవి కాదన్నారు. నగరంలో నీటి సమస్య ఉందని.. భాజపాను గెలిపిస్తే ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ దేశంలో అందరికీ ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయించారని గుర్తు చేశారు. ఖైరతాబాద్‌ భాజపా అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్మృతి ఇరానీ ఓటర్లను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img