icon icon icon
icon icon icon

Yogi Adityanath: భారాస, కాంగ్రెస్‌ అజెండా ఒక్కటే: యోగి ఆదిత్యనాథ్‌

భారాస, కాంగ్రెస్‌ అజెండా ఒక్కటేనని, వ్యక్తిగత అభివృద్ధి కోసమే వాళ్లు పని చేస్తారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. 

Published : 25 Nov 2023 16:04 IST

వేములవాడ: భారాస, కాంగ్రెస్‌ అజెండా ఒక్కటేనని, వ్యక్తిగత అభివృద్ధి కోసమే ఆ పార్టీలు పని చేస్తారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్‌, పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చేదా?అని ప్రశ్నించారు. వేములవాడలో నిర్వహించిన ‘భాజపా సకల జనుల విజయసంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. ఎంఐఎంకు భయపడటం వల్లే  సీఎం కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలేదని.. భాజపా అధికారంలోకి రాగానే ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

‘‘ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇక్కడి పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. దీనికి నిదర్శనమే ముస్లిం రిజర్వేషన్లు. భాజపాను గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి,, ఆ ఫలాలు వెనకబడిన వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటాం. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో రాష్ట్రం ఏర్పడితే.. కేసీఆర్‌ ప్రభుత్వం ఏ డిమాండ్‌నూ నెరవేర్చలేకపోయింది. యూపీలో కూడా 2017 కంటే ముందు ఇలాంటి పరిస్థితే ఉండేది. అక్కడున్న యువకులు, నిరుద్యోగులు అప్పట్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల వచ్చాయి. ఆరేళ్లలో అక్కడ ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం. డబుల్‌ ఇంజన్ సర్కార్ అంటే డబుల్‌ ఇంజిన్‌ స్పీడుతో ఉపాధి, శాంతిభద్రతలు కల్పించడం’’ అని యోగి అన్నారు.

మోదీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయంగా భారతదేశం తలెత్తుకునే స్థాయికి ఎదిగిందని యోగి అన్నారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చని స్థితిలో ఉన్నందునే పార్టీ పేరును తెరాస నుంచి భారాసగా కేసీఆర్‌ మార్చుకున్నారని విమర్శించారు. వేములవాడ భాజపా అభ్యర్థి వికాస్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను యోగి ఆదిత్యనాథ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img