Pata Seca: ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!

బ్రెజిల్‌కు చెందిన నల్లజాతి బానిస‌.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు.

Updated : 28 Mar 2024 20:30 IST

ఇంట‌ర్నెట్ డెస్క్ ప్రత్యేకం: అత‌ను ఆజానుబాహుడు.. కాదు, అంత కంటే ఎక్కువ పొడుగు. దాదాపు ఏడు అడుగులు ఉంటాడు. న‌ల్లని శ‌రీర‌ఛాయ‌.. కండ‌లు తిరిగిన దేహం.. ఆడ‌వారికి క‌ల‌ల రాకుమారుడు.. అత‌నే ప‌టా సెకా (Pata Seca). బ్రెజిల్‌కు చెందిన నల్లజాతి బానిస‌. 19వ శ‌తాబ్దంలో బ్రెజిల్‌లో బానిస వ్యాపారం విప‌రీతంగా జ‌రిగేది. మాన‌వ‌త్వానికి మాయ‌ని మచ్చగా మిగిలిన ఈ వ్యాపారంలో సాటి మ‌నుషులన్న ద‌య లేకుండా వారిని కొనుగోలు చేసి త‌మ వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లల్లో వినియోగించేవారు.

ఇష్టానికి వ్యతిరేకంగా..

ఇత‌ని దారుఢ్యానికి ఆశ్చర్యపోయిన అనేక‌మంది బానిస‌ల య‌జ‌మానులు త‌మ కింద ప‌నిచేసే నల్లజాతి యువ‌తుల‌తో అత‌నితో బ‌ల‌వంతంగా సంప‌ర్కం చేయించేవారు. ఇత‌ని వ‌ల్ల జన్మించే బిడ్డలు బ‌లంగా పుట్టడంతో పాటు అన్ని ప‌నులు చేస్తార‌న్న నమ్మకం ఉండేది. సెకా య‌జ‌మానికి ఇదో ఆదాయ‌వ‌న‌రుగా మారింది. దీంతో సెకాను ఈ ప‌నుల‌కే వినియోగించేవాడు.

200 మందికిపైగా సంతానం

ఇలా ప‌లువురు నల్లజాతి యువ‌తులు, మ‌హిళ‌ల‌తో సంభోగించ‌డంతో దాదాపు 200 మందికి పైగా జ‌న్మించిన‌ట్టు అప్పటి లెక్కలు చెబుతున్నాయి. ఇత‌ని ద్వారా పుట్టిన బిడ్డలకు 11 ఏళ్లు రాక‌ముందే క‌ష్టమైన ప‌నులను చేయించ‌డం గ‌మ‌నార్హం. 

బానిస‌త్వం ర‌ద్దుతో..

1888లో బ్రెజిల్‌లో బానిస‌త్వం రద్దయింది. దీంతో సెకా స్వేచ్ఛావాయువుల‌ను పీల్చుకున్నాడు. అనంత‌రం ప‌ల్మైరా అనే మ‌హిళ‌ను వివాహం చేసుకొని తొమ్మిదిమంది బిడ్డలకు తండ్రయ్యాడు. దాదాపు 130 సంవత్సరాలు అతడు జీవించిన‌ట్టు స‌మాచారం. 1958లో క‌న్నుమూశాడు. త‌న శ‌రీర‌సౌష్ఠవం, బ‌లమే శాపంగా మారిందనడానికి సెకా జీవితం ఒక ఉదాహ‌ర‌ణ‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని