Child body builder : పన్నెండేళ్ల ప్రాయం.. ఆరు పలకల దేహం!
బ్రెజిల్ (Brazil)కు చెందిన ఓ బాలుడు అతి చిన్న వయసులోనే కఠోరమైన కసరత్తులు చేసి సిక్స్‌ప్యాక్ (Six pack) సంపాదించాడు. తన వర్కౌట్ల (Work out) వీడియోలను సామాజిక మాధ్యమాల్లో (Social media)పోస్టు చేస్తూ అందరి చేత ఔరా అనిపిస్తున్నాడు.
(Image : Cacauzinho neto)
ఆ బుడతడి ప్రాయం పన్నెండేళ్లు మాత్రమే. కానీ.. ఆరు పలకల దేహంతో (Six pack) కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అందరు పిల్లలూ ఆటలతో కాలక్షేపం చేస్తుంటే.. ఇతడు మాత్రం జిమ్‌లో (zym)తన శరీరాకృతిని మార్చుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. బ్రెజిల్ (Brazil)దేశానికి చెందిన బాలుడు కాజిన్‌యో నెటో తన వర్కౌట్ల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఆ బుల్లి కండల వీరుడి కథేంటో తెలుసుకోండి మరి.
తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని..
కాజిన్‌యో నెటో అసలు పేరు కార్లోస్ అగస్టో పిటాంగ నెటో. తన తండ్రి వర్కౌట్లు చేయడం చూసి జిమ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అదే కుతూహలంతో రెండేళ్ల క్రితం జిమ్‌లో చేరాడు. ఇప్పుడు కాజిన్‌యో ఏ స్థాయికి వెళ్లాడంటే.. తన శరీరం కన్నా రెండు రెట్ల బరువును అవలీలగా ఎత్తి పడేస్తున్నాడు. ఏ మాత్రం సంకోచించకుండా 700 క్రంచ్‌లు చేయగలుగుతున్నాడు. సరిగ్గా ఈ వయసున్న పిల్లలు వారాంతం వస్తే పాఠశాలకు వెళ్లాల్సిన పని లేదని ముసుగు తన్ని పడుకుంటారు. కానీ, కాజిన్‌యో మాత్రం ఠంచనుగా ఉదయం 5.30 కల్లా నిద్ర లేస్తాడు. ఆ వెంటనే సుమారు 5 కిలోమీటర్ల దూరం పరుగు తీస్తాడు. ఆ తరువాత కొన్ని సిటప్స్ తీస్తాడు. పాఠశాల ఉన్నా లేకపోయినా ఈ బుల్లి కండల వీరుడి దినచర్య నిత్యం ఇలాగే సాగుతుంది. పాఠశాల నుంచి వచ్చి హోంవర్క్ పూర్తి చేసుకుని ఇక జిమ్‌లోకి వెళ్లిపోతాడు. దాదాపు 2.5 గంటలు అక్కడే గడిపేస్తాడు. ఆ సమయంలో కఠోరమైన డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్, బెంచ్ ప్రెసెస్స్, బైసెప్ కర్ల్స్ వంటి వ్యాయామాలు సాధన చేస్తాడు.
అవలీలగా కసరత్తులు
కాజిన్‌యోకి తొలుత ఫుట్‌బాల్ ఆటపై విపరీతమైన మోజు ఉండేదట. వేసవి సెలవుల్లో తనను జిమ్‌లో చేర్పించారు. కేవలం 15 రోజుల్లోనే అతడు కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. ఆ వయసులోని మిగతా పిల్లలకు సాధ్యం కాని పనులన్నీ కాజిన్‌యో అవలీలగా చేయడంతో అతని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తమ బిడ్డ అథ్లెట్‌గా కచ్చితంగా రాణిస్తాడనే నమ్మకానికి వచ్చారు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా ఒక కోచ్, డాక్టర్, ఫిజియో థెరపిస్ట్, న్యూట్రిషియన్‌ను నియమించుకున్నారు. వారి ఖర్చు ఏ మాత్రం వృథా కాలేదు. కాజిన్‌యో కసరత్తులు సామాజిక మాధ్యమాల్లో చూసిన వారంతా అతను తప్పకుండా ‘బ్రెజిలియన్ క్రాస్‌ఫిట్’ అవుతాడని కీర్తిస్తున్నారు.
నెటిజన్ల విమర్శలు
కాజిన్‌యో ఒక పద్ధతి ప్రకారం జిమ్ చేస్తున్నాడు. దాంతో అతడి శరీర ఆకృతి మాత్రమే మారింది. బరువు, ఎత్తు పెరుగుదల సాధారణ పిల్లల్లాగే ఉంటోంది. కాజిన్‌యో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన మొదట్లో 1.34 మీటర్ల ఎత్తు ఉండేవాడు. ఇప్పుడు 1.47 మీటర్ల ఎత్తు పెరిగాడు. తొలుత 33 కేజీల బరువుండగా.. ప్రస్తుతం 38 కేజీలకు చేరుకున్నాడు.
బ్రెజిల్ బాలుడు అసాధారణ రీతిలో కసరత్తులు చేస్తున్నాడనే విషయాన్ని ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాలకు చెందిన కొన్ని మీడియా సంస్థలు కథనాల రూపంలో వెలువరించాయి. దాంతో చిన్న వయసులోనే మితిమీరిన బరువులు ఎత్తడం మంచిది కాదని కొందరు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. అతి బరువులు ఎత్తుతూ.. కండరాలు పెంచడం వల్ల ఎముకలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలన్నింటినీ కాజిన్‌యో తల్లిదండ్రులు కొట్టిపడేశారు. పూర్తిగా నిపుణుల పర్యవేక్షనలోనే తమ చిన్నారికి శిక్షణ కొనసాగుతోందని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆరోపించినట్లుగా కాజిన్‌యో డైట్‌లో పెరుగుదల హార్మోన్లు లేవని, నిపుణుల సలహా మేరకు క్రియేటైన్, ఒమేగా-3 మాత్రమే ఇస్తున్నామని వివరించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!