Cultured meat : ఆస్ట్రేలియా కంపెనీ అరుదైన ప్రయోగం.. కృత్రిమంగా మీట్ బాల్!
కృత్రిమంగా తయారు చేసిన మమ్మత్ (Mammoth) మీట్ బాల్‌ను గత వారం నెదర్లాండ్స్‌లోని ‘నెమో’ సైన్స్ మ్యూజియంలో (Science museum) ప్రదర్శించారు. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ రుచి చూడలేదు. ఒక వేళ తింటే అది మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై ఇంకా పరిశోధిస్తున్నారు.
(Image : Facebook)
ఆస్ట్రేలియాకు (Australia) చెందిన ‘ల్యాబ్ గ్రోన్ మీట్’ కంపెనీ ‘వావ్’ సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. వందల ఏళ్ల క్రితం అంతరించి పోయిన వూలీ మమ్మత్ (Woolly mammoth) డీఎన్‌ఏతో కృత్రిమ మాంసం సృష్టించి వాటితో మీట్ బాల్‌ను తయారు చేసింది. చికెన్ (Chicken), బీఫ్, పోర్క్ వంటి కృత్రిమ మాంస ఉత్పత్తులకు భిన్నంగా ఈ మాంసాన్ని (Meat) తయారు చేసింది. భూమిపై మనుగడలో లేని, అంతరించిపోయే దశలో ఉన్న జంతువుల కృత్రిమ మాంసాన్ని పెంచడంపై ఈ కంపెనీ దృష్టి సారించింది. ఎప్పుడో అంతరించిపోయిన మమ్మత్ మాంసకృత్తులను సృష్టించేందుకు ఈ కంపెనీ దాని డీఎన్‌ఏ (DNA) క్రమాన్ని పరిగణనలోకి తీసుకుంది. మాంసానికి రుచిని అందించడంలో దాని కండరాల ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మాంసాన్ని రెట్టింపు చేయడం కోసం ఏనుగు డీఎన్‌ఏను కూడా వినియోగించారు. ఆ రెండింటిని గొర్రె నుంచి సేకరించిన కండర కణాలతో కలిపి బిలియన్ల కొద్దీ కణాలను అభివృద్ధి చేశారు. దాంతో అరుదైన కృత్రిమ మాంసం (Cultured meat) తయారైంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పట్టిందని ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వోల్వెట్యాంగ్ తెలిపారు. తొలుత కృత్రిమ మాంసం తయారీలో డోడో పక్షి డీఎన్‌ఏను వినియోగించాలనుకున్నారు. చివరికి అంతరించిపోయిన అరుదైన జీవి మమ్మత్‌ను ఎంపిక చేశారు. మార్కెట్లో దొరికే వాటికి భవిష్యత్ ప్రత్యామ్నాయం కృత్రిమ మాంసమేనని ప్రచారం చేయడం కోసం కంపెనీ ఈ మార్గాన్ని ఎంచుకుంది. ‘వావ్’ కంపెనీ ఇప్పటికే దున్న, మొసలి, కంగారు, నెమలి మాంసాలను అభివృద్ధి చేసి కొత్త రుచులను కనుగొంది.
ఏంటీ ల్యాబ్ గ్రోన్ మీట్?
మనుషులు కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచే మాంసం తింటున్నారు. కాలక్రమంలో రకరకాల పక్షులను, జంతువులను మాంసం కోసం పెంచడం అలవాటు చేసుకున్నారు. ఈ పద్ధతిని మార్చేందుకు శాస్త్రవేత్తలు ‘ల్యాబ్ గ్రోన్ మీట్’ను అభివృద్ధి చేశారు. దీన్నే ‘కల్చర్డ్ మీట్’ అని కూడా పిలుస్తారు. అంటే మొక్కలను పెంచినట్లు ల్యాబ్‌లో మాంసాన్ని వృద్ధి చేస్తారు. ఈ విధానంలో జంతువులను వధించరు. కేవలం వాటి నుంచి కొన్ని రకాల కణాలను సేకరిస్తారు. జీవధాతు పరీక్ష, గుడ్లు ఫలదీకరణం వంటి విధానాలను అనుసరించి కండరం, కొవ్వుకణాలను సేకరించి పరీక్షల్లో వినియోగిస్తారు. ఈ విధానంలో మాంసం తయారు చేయడం వల్ల వృక్ష, జంతు జాతులను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. యూఎస్‌కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్ గ్రోన్ మీట్‌ను మనుషులు ఆహారంగా తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగపూర్‌లో అధికారికంగా ల్యాబ్ గ్రోన్ మీట్‌ను విక్రయిస్తున్నారు. మన దేశంలోనూ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(CCMB)లో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు