crypto currency: బిట్‌కాయినే కాదు.. చాలా ఉన్నాయి!
ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం పెరుగుతోంది. వీటికి భౌతిక ప్రపంచంలో రూపం లేదు. చేతులతో పట్టుకోలేం.. జేబులో పెట్టుకోలేం. వీటి లావాదేవీలన్నీ ఆన్‌లైన్ బ్లాక్‌చెయిన్ మార్కెట్లోనే జరుగుతుంటాయి. ఈ డిజిటల్ కరెన్సీ విలువ నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం పెరుగుతోంది. వీటికి భౌతిక ప్రపంచంలో రూపం లేదు. చేతులతో పట్టుకోలేం.. జేబులో పెట్టుకోలేం. వీటి లావాదేవీలన్నీ ఆన్‌లైన్ బ్లాక్‌చెయిన్ మార్కెట్లోనే జరుగుతుంటాయి. ఈ డిజిటల్ కరెన్సీ విలువ నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా పెట్టుబడి పెట్టి సంపాదించే డిజిటల్ కరెన్సీనే క్రిప్టో కరెన్సీ అంటారు. అయితే, చాలా మందికి బిట్‌కాయిన్ గురించి మాత్రమే తెలుసు. దీంతో పాటు ఇంకా చాలా రకాల క్రిప్టో కరెన్సీలు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో టాప్ 10 క్రిప్టోకరెన్సీలు.. వాటి విలువ ఎంతో తెలుసుకుందామా..!
బిట్‌కాయిన్
ఒక బిట్‌కాయిన్ = 61803.11 యూఎస్ డాలర్లు (రూ.45.85లక్షలు)
మొత్తం మార్కెట్ విలువ = 1.7 ట్రిలియన్ డాలర్లు
ప్రారంభం: 2009
ఇథెరియమ్
ఒక ఇథెరియమ్ = 4582.73 యూఎస్ డాలర్లు (రూ.3.39లక్షలు)
మొత్తం మార్కెట్ విలువ = 520 బిలియన్ డాలర్లు
ప్రారంభం: 2009
బినాన్స్ కాయిన్
ఒక బినాన్స్ = 661.93 యూఎస్ డాలర్లు (రూ. 49,109.48)
మొత్తం మార్కెట్ విలువ = 88 బిలియన్ డాలర్లు
ప్రారంభం: 2017
సోలానా
ఒక సోలానా = 251.95 డాలర్లు (రూ.18,692.51)
మొత్తం మార్కెట్ విలువ = 60 బిలియన్ డాలర్లు
ప్రారంభం: 2018
టెథర్
ఒక టెథర్ = 1 యూఎస్ డాలర్ (రూ.74.19)
మొత్తం మార్కెట్ విలువ = 70 బిలియన్ డాలర్లు
ప్రారంభం : 2014
కర్డనో
ఒక కర్డనో = 1.99 యూఎస్ డాలర్లు (రూ.147.64)
మొత్తం మార్కెట్ విలువ = 66 బిలియన్ డాలర్లు
ప్రారంభం : 2015
ఎక్స్‌ఆర్‌పీ
ఒక ఎక్స్‌ఆర్‌పీ = 1.17 యూఎస్ డాలర్లు (రూ.86.80)
మొత్తం మార్కెట్ విలువ = 50 బిలియన్ డాలర్లు
ప్రారంభం: 2012
యూనిస్వాప్
ఒక యూనిస్వాప్ = 22.36 డాలర్లు (రూ.1,662)
మొత్తం మార్కెట్ విలువ = 13 బిలియన్ డాలర్లు
ప్రారంభం: 2018
పొల్కడాట్
ఒక పొల్కడాట్ = 52.87 యూఎస్ డాలర్లు (రూ.3,922.50)
మొత్తం మార్కెట్ విలువ = 43 బిలియన్ డాలర్లు
ప్రారంభం: 2016
డాగీ కాయిన్
ఒక డాగీ కాయిన్ = 0.26యూఎస్ డాలర్లు (రూ.19.48)
మొత్తం మార్కెట్ విలువ = 44 బిలియన్ డాలర్లు
ప్రారంభం: 2007.. ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ వల్ల ఈ ఏడాదే పాపులరైంది.
యూఎస్‌డీ కాయిన్
ఒక యూఎస్‌డీ కాయిన్ = 1 యూఎస్ డాలర్ (రూ.74.19)
మొత్తం మార్కెట్ విలువ = 34 బిలియన్ డాలర్లు
ప్రారంభం: 2018
గమనిక: క్రిప్టో కరెన్సీ విలువ 07-11-2021 నాటి లెక్కల ప్రకారం
సోర్స్: కాయిన్ మార్కెట్ క్యాప్ & ఫోర్బ్స్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్‌లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!