Variety hotels : కాక్‌పిట్‌లో నిద్రపోతారా.. సముద్రంలో సేద తీరుతారా?
అతిథులకు (Guest) సరికొత్త అనుభూతిని పంచేందుకు ప్రపంచ నలుమూలల్లో కొన్ని వైవిధ్యమైన హోటళ్లు (Hotel) వెలిశాయి. వాటిపై ఓ లుక్కేయండి.
‘లోకో భిన్న రుచి’ అన్నారు. ఒకరికి విమానం (Flight)కాక్‌పిట్‌లో పవళించాలనే కోరిక. మరొకరికి నీటిలోపలే ఉండి సముద్ర (sea)జీవులు ఎలా తిరుగాడుతుంటాయో చూడాలని ఆసక్తి. ఇవన్నీ నెరవేరడం అసాధ్యం అని అనుకుంటున్నారు కదూ! డబ్బులుంటే అవేవీ తీరని కోరికలు కావని అంటున్నారు ఈ వైవిధ్యమైన హోటళ్ల నిర్వాహకులు. ఆ సంగతేంటో చదివేయండి.
Image : poseidonresorts.com
సముద్ర గర్భంలో సౌకర్యాలు
కడలి అందాలకు నెలవైన ఫిజీ దేశంలో పొసైడన్ అండర్ సీ రిసార్టు అతిథులకు అద్భుతమైన అనుభూతిని పంచుతోంది. ఇందులో 40 అడుగుల లోతు నీటిలో విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన గదులను ఏర్పాటు చేశారు. 5 వేల ఎకరాల్లో ఉన్న ఈ రిసార్టులోకి ఎలివేటర్ సహాయంతో తీసుకెళ్తారు. స్వచ్ఛంగా కనిపించే సముద్రపు నీటిలో సంచరించే వివిధ రకాల జీవజాతులను చూస్తూ మైమరచిపోవచ్చు. కొన్ని సార్లు షార్క్‌లు సైతం అతిథుల గదులకు దగ్గరగా వచ్చి పోతుంటాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రిసార్టులో వారం రోజులు గడపాలంటే సుమారు 30 వేల డాలర్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Image : jumbostay.com
కాక్‌పిట్‌లో నిద్రపోవచ్చు!
విమానాన్ని రెస్టారెంట్‌గా మార్చి వివిధ రకాల వంటకాలను వడ్డించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అదే తరహాలో ఓ విమానాన్ని హోటల్‌గా మార్చి గదులను అద్దెకిస్తున్నారు. స్వీడన్‌లోని ఆర్లాండా విమానాశ్రయంలో వినియోగంలో లేని ఓ రన్‌వే ఉంది. దానిపై ఓ ‘జంబో హాస్టల్’ ఏర్పాటు చేశారు. ఇందులో అతిథుల అభిరుచి, స్థోమతను బట్టి రకరకాల గదులను అద్దెకు తీసుకోవచ్చు. కాక్‌పిట్‌లో ఏర్పాటు చేసిన ఓ గది ఈ విమాన హోటల్‌కే హైలెట్ అని చెప్పవచ్చు. అందులో నుంచి చూస్తే సమీపంలోని విమానాశ్రయం మొత్తం పనోరమిక్ వ్యూలో కన్పిస్తుంది. ఆ గది కావాలంటే కాస్త పెద్ద మొత్తంలోనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక హోటల్‌లోని ప్రతి గదిలో ఏర్పాటు చేసిన టెలివిజన్‌ల తెరపై విమానాశ్రయంలో రాకపోకలు సాగించే లోహ విహంగాల సమాచారం ప్రసారమవుతూ ఉంటుంది. హోటల్ లోపల విమానం ఎక్కిన అనుభూతి కలిగేలా కాక్‌పిట్, కొన్ని రకాల సిగ్నల్ వ్యవస్థలను అలాగే అమర్చి ఉంచారు.
Image : dasparkhotel.net
మురుగు కాలువ పైపులతో గదులు!
ఆస్ట్రియాలోని ఓటన్‌షైమ్ పట్టణానికి సమీపంలో డాస్‌పార్క్ హోటల్ ఉంది. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే దీన్ని పూర్తిగా మురుగు కాలువల కోసం వినియోగించే కాంక్రీటు పైపులతో నిర్మించారు. ఒక్కో గది ఏడు అడుగుల వెడల్పు ఉంటుంది. అందులో ఒక డబుల్ బెడ్, ల్యాంప్, వస్తువులు భద్రపరచుకునే స్థలం, విద్యుత్ బోర్డు ఉంటాయి. ఇక్కడ విడిదికి వచ్చిన అతిథులు స్నానం చేయాలంటే 330 అడుగుల దూరం నడవాల్సిందే. తాగునీరు కావాలంటే వీధి కుళాయి దగ్గరకు వెళ్లాలి. టీ, టిఫిన్, భోజనం ఏది కావాలన్నా సమీపంలోని కెఫేనే దిక్కు. ఇన్ని అసౌకర్యాలున్న ఈ హోటల్‌లో ఎవరు దిగుతారులే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడి గదులకు కచ్చితంగా ఇంతే చెల్లించాలనే నిబంధన లేదు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోగానే ఓ కోడ్ వస్తుంది. దాన్ని తలుపు దగ్గరున్న కీపాడ్‌లో నమోదు చేసి గదిలోకి వెళ్లొచ్చు. తిరిగి గది ఖాళీ చేసే సమయంలో మనకు తోచినంత ఇచ్చేయొచ్చు. ఈ హోటల్‌కు మంచి ఆదరణ రావడంతో నిర్వాహకులు జర్మనీలో మరో హోటల్ తెరిచారని సమాచారం.
Image : Sunnsandhotel
ఇసుకతో గదులు
‘ప్రయత్నిస్తే ఇసుక నుంచి చమురు తీయవచ్చట’.. అలాగే ప్రయత్నించి ఇసుకతో ఏకంగా ఓ హోటల్ నిర్మించారు. లండన్‌లోని వీమత్ బీచ్‌లో ఈ వైవిధ్యమైన హోటల్‌ను తీర్చిదిద్దారు. దీనిని రూపొందించేందుకు సుమారు వెయ్యి టన్నుల ఇసుక వినియోగించినట్లు సమాచారం. ఇందులో మంచాలు, సోఫాలను కూడా ఇసుకతోనే తీర్చిదిద్దారు. ఇక్కడ బస చేస్తే సముద్ర అలల హోరును వింటూ అలా నిద్రలోకి జారుకోవచ్చని దీని నిర్వాహకులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Sangareddy: గడ్డపోతారంలో విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!