Heart Attack Restaurant : ‘హార్ట్ ఎటాక్’ రెస్టారెంట్.. అక్కడ అంతా భారీ జంక్!
అమెరికాలోని ఆ రెస్టారెంట్ (Restaurant) పేరు ‘హార్ట్ ఎటాక్’(Heart Attack). అందులో జంక్‌ఫుడ్ (junk food) మాత్రమే దొరుకుతుంది. విచిత్రమైన థీమ్‌తో ఆకర్షిస్తున్న దాని కథేంటో తెలుసుకోండి.
(Image : Heart Attack Grill)
ఆరోగ్యానికి చేటు చేస్తుందని తెలిసినా కొందరు జంక్‌ఫుడ్ (junk food) తినడానికి ఇష్టపడతారు. క్యాలరీలను (calories) లెక్కచేయకుండా పిజ్జాలు, బర్గర్లు (Burgers), ఫ్రెంచ్ ఫ్రైస్ లాగించేస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే అమెరికాలోని (America) లాస్ వెగాస్‌లో ‘హార్ట్ ఎటాక్ గ్రిల్ రెస్టారెంట్’ను స్థాపించారు. అక్కడి ప్రత్యేకతలేంటో చదివేయండి.
వామ్మో ఇన్ని క్యాలరీలా?
జంక్‌ఫుడ్ ప్రియులంతా హ్యామ్ బర్గర్‌ను లొట్టలేసుకుంటూ తింటారు. అయితే ‘హార్ట్ ఎటాక్ గ్రిల్ రెస్టారెంట్’లో దొరికే హ్యామ్‌బర్గర్ తింటే ఏకంగా 10వేల క్యాలరీల శక్తి లభిస్తుందట. శరీరంలోకి వెళ్లిన ఆ క్యాలరీలన్నీ కొవ్వుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కేవలం బర్గర్‌లు మాత్రమే కాదు ఇక్కడ ప్రతిదీ అతిగానే ఉంటుంది. ఒక్క వ్యక్తి ఆరగించే స్థాయిలో ఏ ఐటమ్ కూడా ఉండదు. అందుకే ఈ రెస్టారెంట్‌ను మొదలుపెట్టినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
హాస్పటల్ వాతావరణం
‘హార్ట్ ఎటాక్ గ్రిల్ రెస్టారెంట్’ను జాన్ బాసో అనే వ్యక్తి 2005లో ప్రారంభించాడు. అందులోకి అడుగుపెట్టగానే హాస్పటల్‌కు వచ్చామా? అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడకు వచ్చే ఆహార ప్రియులను కస్టమర్లుగా కాకుండా ‘రోగులు’ అని సంబోధిస్తారు. అంతేకాదండోయ్ ఆ రోగులకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ గౌను కూడా తొడుగుతారు. ఇక్కడ పని చేసే వెయిట్రస్‌లను నర్సులని, వెయిటర్లను డాక్టర్లని పిలుస్తారు. ఇక కస్టమర్ ఇచ్చే ఆర్డర్‌ను ‘ప్రిస్క్రిప్షన్’ అంటారు.
అంత ఫుడ్ ఎవరైనా తింటారా?
ముందుగా చెప్పినట్లు ఇక్కడ హ్యామ్‌బర్గర్లే కాకుండా బైపాస్ బర్గర్‌లు చాలా ఫేమస్. బైపాస్ బర్గర్ అంటే ఒకదానిపై మరొకటి పెడుతూ వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుతూ పోతారు. ఇవే కాకుండా ఫ్లాట్‌లైనర్ ఫ్రైస్, కరోనరీ డాగ్, మద్యం, బటర్ ఫ్యాట్ మిల్క్‌షేక్, ఫుల్ షుగర్ కోలా, చిన్నారుల కోసం క్యాండీ సిగరెట్స్ దొరుకుతాయి. ఇవన్నీ ఆర్డర్ చేశాక పూర్తిగా తినకపోతే శిక్ష కూడా ఉంటుంది. అదేంటంటే నర్సుల్లో ఒకరు రోగులను సరదాగా బెల్టు లేదా తెడ్డుతో కొడతారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ ఈ శిక్ష. ఈ రెస్టారెంట్ మరో వింత ఏమిటంటే 350 పౌండ్ల కన్నా అధిక బరువున్న వారికి తిన్నంత ఫుడ్‌ను ఉచితంగా పెడతారు.
తొలి నుంచి వివాదాలు
కస్టమర్ల ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని ఈ రెస్టారెంట్ ప్రోత్సహిస్తోందని పలువురు విమర్శించారు. దాంతో ఈ రెస్టారెంట్ పేరు తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. వీరు తయారు చేసిన భారీ క్యాలరీలతో కూడిన ఆహార పదార్థాలు తిని అనారోగ్యం బారిన పడిన వారు అనేక మంది ఉన్నారు. అయినా, అటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడం మానలేదు. ఇక్కడ తినడం వల్ల హాని జరుగుతోందని తెలిసినా వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉందట.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్
-
Crime News
‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్’తో బురిడీ.. ఐటీ అధికారుల ముసుగు దొంగల చోరీ కేసులో కీలక విషయాలు
-
Movies News
BIG B: ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతూ.. తనను తాను నిందించుకున్న అమితాబ్
-
Politics News
Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే.. 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్ గాంధీ!
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?