Fake notes: నకిలీ నోట్లతో మోసపోవద్దు సుమా...!
నకిలీ నోట్లను పైపైనా చూసి గుర్తించడం కష్టమే. కానీ, కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అసలేదో.. నకిలీదేదో తెలిసిపోతుంది. అందుకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ నోటు ఏ విధంగా ఉంటుందో..
₹500 నోటు.. ఒరిజినలా..? నకిలీదా..? ఇలా తెలుసుకోవడం?
కొత్త కరెన్సీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత నకిలీ నోట్ల బెడద తగ్గిందనుకున్నా.. మళ్లీ నకిలీలు చలామణిలోకి వస్తున్నాయి. ఎక్కువగా పెద్దనోట్లలోనే నకిలీలు కనిపిస్తాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామ వాలంటీర్ వృద్ధులకు ఇచ్చే పింఛనులో నకిలీ నోట్లను పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. అసలు ఈ నోట్లలో అసలుకు, నకిలీకి తేడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
నకిలీ నోట్లను పైపైనా చూసి గుర్తించడం కష్టమే. కానీ, కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అసలేదో.. నకిలీదేదో తెలిసిపోతుంది. అందుకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ నోటు ఏ విధంగా ఉంటుందో.. తెలియజేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది.
₹500 ఒరిజినల్ నోటు ఎలా ఉంటుందంటే...
* ముందుభాగంలో నోటు ఎడమవైపు కిందిభాగంలో తెలుపు, గోధుమవర్ణంలో 500 సంఖ్య కనిపిస్తుంది.
* నోటుని 45 డిగ్రీల కోణంలో వంచి చూసినట్లయితే.. నోటు కిందిభాగంలో ఉన్న ఆకుపచ్చ స్ట్రిప్‌లో 500 సంఖ్యని గమనించవచ్చు.
* స్ట్రిప్ పైన 500 సంఖ్య దేవనాగరి లిపిలో రాసుంటుంది.
* నోటు మధ్యభాగంలో మహాత్మాగాంధీ చిత్రపటం కనిపిస్తుంది.
* నోటును వంచి చూసినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే భద్రతా తీగ.. నీలంలోకి మారుతుంది.
* భద్రతా తీగ కుడివైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం, దానికింద ఆర్‌బీఐ చిహ్నం ఉంటాయి.
* దాని పక్కనే 500 సంఖ్య ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్‌ను గమనించొచ్చు.
* నోట్ల సిరీస్‌ను తెలియజేసే సంఖ్యలు కుడివైపు కిందిభాగంలో ఎడమ నుంచి కుడికి సైజు పెరుగుతూ కనిపిస్తాయి.
* నోటు కుడివైపు కిందిభాగం చివరన భారత జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ ఉంటుంది.
* వెనక భాగంలో ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
* స్వచ్ఛభారత్ నినాదంతో కూడిన లోగో కనిపిస్తుంది.
* దేశంలోని 15 భాషల్లో నోటు విలువను పేర్కొంటూ లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది.
* లాంగ్వేజ్ ప్యానెల్ పక్కనే దిల్లీలోని ఎర్రకోట చిత్రం కనిపిస్తుంది.
* వీటిని పరిశీలించిన తర్వాత మీ వద్ద ఉన్న నోటు ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే ఏదైనా బ్యాంకు సిబ్బందిని సంప్రదించింది.. అసలుదా.. నకిలీదా నిర్థారించుకోండి.
-ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా