Stunt rider : ఈ అమ్మాయి స్టంట్స్ చూస్తే ఔరా అనాల్సిందే!
కేరళకు చెందిన ఓ అమ్మాయి బైక్ రైడర్‌గా రాణిస్తూ అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తోంది. ఆమె టాలెంట్ చూసి పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
(Image : Instagram)
సాధారణంగా అమ్మాయిల సామాజిక మాధ్యమాల(Social media) ఖాతాలను పరిశీలిస్తే ఎక్కువగా అందానికి(Beauty), ఫ్యాషన్(Fashion)కు ప్రాధాన్యమిచ్చే అంశాలు కన్పిస్తుంటాయి. కానీ కేరళ(Kerala)కు చెందిన తానా లూసియా జోజి ఇన్‌స్టా(Instagram) ఖాతాలో మాత్రం ఆమె బైక్(Bike)పై చేసే విన్యాసాల చిత్రాలు(Photos), వీడియోలు(Vedio) దర్శనమిస్తాయి. ఫ్రాన్స్(France)కు చెందిన ప్రముఖ లేడీ స్టంట్ రైడర్(Stunt rider) సారా లెజిటోను స్ఫూర్తిగా తీసుకొని సాహసం శ్వాసగా సాగిపోతున్న జోజి స్టంట్స్ ప్రయాణంపై ఓ లుక్కేయండి.
చిన్నప్పటి నుంచే ఆసక్తి
కేరళ(Kerala)లోని కొట్టాయంకు చెందిన తానా లూసియా జోజికి చిన్నప్పటి నుంచే బైక్(Bike)లపై విపరీతమైన ఆసక్తి చూపేది. హోండా యాక్టివా నడుపుతూ తానూ ఓ రేసర్(Racer)లా ఫీలయ్యేది. తరువాత ఇంజినీరింగ్ చదివేందుకు కక్కనాడ్‌లోని రాజగిరి కళాశాలలో చేరింది. ఆ సమయంలో ఓ బైక్‌పై చిన్నపాటి స్టంట్(Stunt) చేయడంతో ఆమెకేదో తెలియని ఆనందం కలిగింది. ఆ వీడియోను తన తల్లిదండ్రులు డాక్టర్ జోజి అబ్రహం, డాక్టర్ దీపాకు చూపించింది. అది చూసిన తరువాత వారు తమ కూతురు యాక్టివా నడిపే స్థాయి దాటేసిందనే నమ్మకానికి వచ్చారు. ఆమె కోరిక మేరకు బైక్ కొనివ్వడానికి సమ్మతించారు. అలా తానా తొలిసారి బజాజ్ అవెంజర్ కొనుగోలు చేసింది. అప్పట్లో హైట్ గురించి ఆలోచించి ఆ బైక్ కొనుగోలు చేసినట్లు తానా ఓ సందర్భంలో వెల్లడించింది.
స్టంట్ రైడింగ్ వైపు అడుగులు
కొత్త బైక్ కొన్న ఆ తర్వాత నుంచి తానా ప్రొఫెషనల్ స్టంట్ రైడింగ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే అభ్యంతరం తెలిపారు. తొలుత చదువు పూర్తి చేసి కెరీర్‌పై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. కానీ ఆమె మనసంతా స్టంట్ రైడింగ్‌పైనే ఉండేది. అందుకే సెమిస్టర్ బ్రేక్ మధ్యలో స్టంట్ రైడింగ్ నేర్చుకుంటానని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించింది. స్టంట్ రైడింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి ఆమె గౌతమ్ సురేశ్‌ను సంప్రదించింది. అతడో టాప్ బైక్ రైడర్. ఓ ప్రమాదానికి గురి కావడంతో చాలాకాలం స్టంట్‌లకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత నుంచి అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తున్నాడు. మొదట్లో తానాకు స్టంట్స్ నేర్పించడానికి సురేశ్ ఒప్పుకోలేదు. కానీ తానా పట్టుదల చూసి చివరికి ఓకే చెప్పాడు.
(Image : Instagram)
విన్యాసాల్లో రాటుదేలి..
తొలి నుంచి తానాకు స్టంట్ రైడింగ్‌పై ఆసక్తి ఉండటంతో కొద్దిరోజుల్లోనే ఆ విద్యపై పట్టు సాధించింది. స్టాపీ, వీలీ ఇలా రకరకాలైన స్టంట్లు చేయడంతో రాటుదేలింది. ఇవన్నీ చేస్తూనే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. దాంతో తానా సామర్థ్యంపై ఆమె తల్లిదండ్రులకు పూర్తిగా నమ్మకం కలిగింది. సరైన జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకు సాగితే ఈ క్రీడ సైతం అమ్మాయిలకు మంచిదేనని ఆమె తల్లిదండ్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఆడపిల్లలకు ఇవన్నీ ఎందుకని బంధువులు విమర్శిస్తే ‘మా అమ్మాయి ఆనందానికి మేమొందుకు అడ్డుకట్ట వేయాలని’ తానా తల్లి దీప దీటుగా సమాధానమిస్తోంది.
సాహస చిత్రాలతో పోస్టులు
తానా కేరళలో ఓ ఫ్రొఫెషనల్ మహిళా బైక్ రైడర్‌గా పేరు తెచ్చుకుంది. మన దేశంలో ఈ క్రీడకు తగిన ఆదరణ లేదు. పైగా దీన్ని పోకిరీలు వీధుల్లో ప్రదర్శించే విద్యగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ ముద్ర పడకుండా తానా పూర్తి జాగ్రత్తలు తీసుకొంటోంది. రద్దీ రోడ్లపై ఎప్పుడూ అలాంటి సాహసాలు చేయలేదు. ప్రస్తుతం తానాకు ఇన్‌స్టాలో 28వేల మంది ఫాలోవర్లున్నారు. అందులో తన స్టంట్స్, ఇతర విషయాలను పోస్టు చేస్తుంటుంది. తానా ‘స్ట్రీట్ లార్డ్స్’ అనే బైక్ స్టంట్ బృందంలో సభ్యురాలిగా కొనసాగుతోంది. కొన్ని షోలు, ప్రకటనలు చేయడం ద్వారా ఈ బృందానికి ఆదాయం లభిస్తోంది. బైక్ కంపెనీలు, ఇతర ఉత్పత్తుల తయారీదారులు మార్కెటింగ్‌లో భాగంగా ఈ స్టంట్ రైడర్లను సంప్రదిస్తుంటారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
TDP: ‘బాబాయిని చంపిందెవరు’.. యువగళం పాదయాత్రలో పోస్టర్లతో ప్రదర్శన
-
Sports News
AUS vs IND WTC Final: జూలు విదల్చాలి.. గద పట్టాలి!
-
Crime News
Hyderabad: ‘25న నా పెళ్లి.. జైలుకెళ్లను’.. కోర్టులో రిమాండ్ ఖైదీ వీరంగం
-
World News
India- Nepal: హిట్ నుంచి సూపర్ హిట్‌కు..! నేపాల్‌తో సంబంధాలపై ప్రధాని మోదీ
-
General News
Polavaram project: 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం
-
Politics News
CM Jagan-Balineni: సీఎం జగన్‌తో బాలినేని భేటీ.. నేతల మధ్య విభేదాలపై చర్చ