లగ్జరీ బ్యూటీ బ్రాండ్‌పై ‘మురికివాడ రాకుమారి’.. మలీశా ఖర్వా గురించి తెలుసా?
మురికివాడలో పుట్టిన ఓ 14 ఏళ్ల అమ్మాయి.. ఓ లగ్జరీ బ్యూటీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఎంపికైంది. తన ప్రతిభతో హాలీవుడ్‌లోనూ అవకాశం దక్కించుకుంది. మలీశా ఖర్వా గురించి తెలుసుకుందామా?
ఇంటర్నెట్ డెస్క్: మురికివాడలో ఉండే ఓ చిన్నారి.. తన ఐదేళ్ల వయసులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ర్యాంప్‌వాక్ చూసి తాను ఉండాల్సిన ప్రపంచం ఇదేనని డిసైడ్ అయ్యింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలేందుకు సిద్ధమైంది. అదృష్టం కలిసొచ్చి మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈ బాలిక.. ఆత్మవిశ్వాసంతో సోషల్‌మీడియా స్టార్‌గా మారింది. ఇప్పుడు ఓ లగ్జరీ బ్యూటీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా సంతకం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమే 14 ఏళ్ల మలీశా ఖర్వా (Maleesha Kharwa)..!
ఆ హీరో గుర్తించిన మట్టిలో మాణిక్యం..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయిలోని ధారావిలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది మలీశా ఖర్వా. తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్నా.. మలీశాకు ఆత్మవిశ్వాసం మాత్రం నిండుగా ఉంది. గుక్కతిప్పుకోకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడగలదు. అదే ఆమెను ప్రత్యేకంగా మార్చింది. మలీశాకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఓ ఫ్యాషన్‌షోలో ప్రియాంక చోప్రా ర్యాంప్‌వాక్ చేయడం చూసింది. అప్పుడే తాను కూడా మోడల్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అందుకోసం ఏం చేయాలి..? ఎక్కడకు వెళ్లాలి అని తెలియని వయసు ఆమెది. సరిగ్గా ఏడేళ్ల తర్వాత అదృష్టం ఆమె తలుపుతట్టింది.
2020లో హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మన్ ఓ మ్యూజిక్ వీడియో చిత్రీకరణ కోసం ఇండియా టూర్‌కు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ ఆయన ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తన వీడియోలో నటించేందుకు మురికివాడల్లో ఉండే పిల్లల కోసం వెతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో మలీశా ఖర్వా అతడి కంట పడింది. అయితే ఆ వీడియోలోని పాత్రకు ఆమెను కాకుండా మరో చిన్నారిని ఎంపిక చేసుకున్నాడు రాబర్ట్. కానీ మలీశా ఆకట్టుకునే రూపం మాత్రం ఆయన మనసు నుంచి చెరిగిపోలేదు. ఆ తర్వాత ఆ చిన్నారితో మాట్లాడగా మోడల్ కావాలన్న ఆమె కోరికను బయటపెట్టింది. దీంతో రాబర్ట్ ఆమెకు ఆర్థికంగా సాయం చేసేందుకు ‘గో ఫండ్ మి పేజ్’ను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పేరుపై ఖాతా కూడా తెరిచాడు. తొలినాళ్లలో ఆమె వీడియోలను ఆయనే పోస్ట్ చేశారు.
నటుడు రాబర్ట్ హాఫ్‌మన్‌తో మలీశా
స్లమ్ ప్రిన్సెస్..
తన జీవన స్థితిగతులతో పాటు ఎన్నో క్రియేటివ్ వీడియోలను మలీశా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం మొదలుపెట్టింది. దీంతో సోషల్‌మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఆమె ఖాతాను 2.27లక్షల మంది అనుసరిస్తున్నారు. మలీశా వీడియోలకు ఎంతో పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారల చిత్రాలను ప్రచురించే పీకాక్ మ్యాగజైన్ కూడా మలీశా చిత్రంలో కవర్‌పేజీని ప్రచురించింది. మోడల్‌లో పలు ఫొటోషూట్లలో, కార్యక్రమాల్లోనూ మలీశా మెరిసింది. మురికివాడ రాకుమారిగా గుర్తింపు పొందిన ఆమె తన వీడియోల్లో తరచూ #theprincesfromtheslum అని రాస్తుంటుంది.
లగ్జరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా..
ఇప్పుడు మలీశా మరో జాక్‌పాట్ కొట్టేసింది. ప్రముఖ లగ్జరీ సౌందర్య ఉత్పత్తుల సంస్థ ఫారెస్ట్ ఎసెన్షియల్ సరికొత్తగా చేపట్టిన ‘యువతి కలెక్షన్’కు మలీశా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఇటీవల ఈ కంపెనీ మలీశా వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ బ్రాండ్‌పై తన ఫొటోలను చూసుకుని ఆమె ఎంతో మురిసిపోయింది. పేదరికంలో ఉన్న చిన్నారులకు చదువు అందించాలనే లక్ష్యంగా ఫారెస్ట్ ఎసెన్షియల్ ఈ ‘యువతి కలెక్షన్’ తీసుకొచ్చింది. ఈ పేరుతో తీసుకొచ్చిన ఉత్పత్తుల విక్రయాల నుంచి వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమానికి ఉపయోగించనుంది. దీనికి మలీశాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడం ప్రత్యేకం. ‘‘సాధించాలనే తపన ఉంటే ఎంత పెద్ద కల అయినా నిజం చేసుకోవచ్చని మలీశా నిరూపించింది.’’ అని ఫారెస్ట్ ఎసెన్షియల్ రాసుకొచ్చింది. ఈ వీడియోకు లక్షలకొద్దీ వీక్షణలు, లైక్‌లు వచ్చాయి.
హాలీవుడ్ సినిమాల్లో..
గతేడాది ఆమె ‘లివ్ యువర్ ఫేరీటెయిల్’ అనే లఘుచిత్రంలో నటించింది. ఆ షార్ట్‌ఫిల్మ్ నటనపరంగా మలీశాకు ఎంతో పేరు తెచ్చింది. ఇటీవల ఆమె రెండు హాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందమైన చిరునవ్వు.. ఆత్మవిశ్వాసంతో నేటితరంలో ఎంతో మంది అమ్మాయిలకు మలీశా స్ఫూర్తిగా నిలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kejriwal: ఎల్జీ సర్.. దిల్లీలో శాంతిభద్రతల బాధ్యతే మీదే.. ఏదైనా చేయండి! : కేజ్రీవాల్
-
Sports News
MS Dhoni: చంద్రుడిపైకి వెళ్లినా సీఎస్కే అభిమానులు ఉంటారు : ఇర్ఫాన్ పఠాన్
-
Movies News
Baharla Ha Madhumas: యూట్యూబ్, ఇన్‌స్టాలో ఈ పాట ఇప్పుడు ట్రెండ్!
-
Sports News
Anand Mahindra: ఐపీఎల్ ఫైనల్‌పై వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
-
Politics News
Eatela rajender: పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు: ఈటల
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్