Happy cities: ఈ నగరాల్లో ఇల్లు కొంటే ఆనందమే మరి!
ఎక్కడో ఓ చోట ఇల్లు కొనుగోలు చేసి హాయిగా స్థిరపడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, ఏ ప్రాంతంలో అన్ని విధాలుగా అనువుగా.. సంతోషకర వాతావరణం ఉంటుందో తెలుసుకోవడం కష్టమే. ఇల్లు కొనుగోలు చేసి కొన్ని రోజులు నివసిస్తే తప్ప.. అక్కడ ఆనందంగా ఉండగలమా లేదా అనేది తెలుకోలేం. అయితే, ఇదే విషయంపై
ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడో ఓ చోట ఇల్లు కొనుగోలు చేసి హాయిగా స్థిరపడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, ఏ ప్రాంతంలో అన్ని విధాలుగా అనువుగా.. సంతోషకర వాతావరణం ఉంటుందో తెలుసుకోవడం కష్టమే. ఇల్లు కొనుగోలు చేసి కొన్ని రోజులు నివసిస్తే తప్ప.. అక్కడ ఆనందంగా ఉండగలమా లేదా అనేది తెలుకోలేం. అయితే, ఇదే విషయంపై ఓ సర్వే సంస్థ పరిశోధన చేసి ఏ ఇబ్బంది పడకుండా.. సంతోషంగా ఇల్లు కొనగలిగే టాప్ 20 ఆనంద నగరాల జాబితాను రూపొందించింది. వీటిలో ఐదు నగరాలు భారత్‌లోనే ఉండటం విశేషం.
యూకెకి చెందిన ఆన్‌లైన్ మోర్టగేజ్ అడ్వయిజర్ అనే సంస్థ రూపొందించిన ఈ జాబితాలో తొలిస్థానంలో స్పెయిన్‌లోని బార్సిలోనా నిలవగా.. భారత్‌లోని లఖ్‌నవూ 20వ స్థానం దక్కించుకుంది.
1. బార్సిలోనా, స్పెయిన్
2. ఫ్లోరెన్స్, ఇటలీ
3. ఉల్సాన్, దక్షిణ కొరియా
4. ప్రాగ్వే, చెక్ రిపబ్లిక్
5. ఛండీగఢ్, భారత్
6. కటోవైస్, పోలాండ్
7. ఇస్లామాబాద్, పాకిస్థాన్
8. బ్యాంకాక్, థాయ్‌లాండ్
9. బెర్లిన్, జర్మనీ
10. జయపుర, భారత్
11. గుడాన్స్క్, పోలాండ్
12. ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ
13. చెన్నై, భారత్
14. బుసాన్, దక్షిణ కొరియా
15. టోక్యో, జపాన్
16. అట్లాంటా, యూఎస్‌ఏ
17. లూయిస్‌విల్లె, యూఎస్‌ఏ
18. ఇండోర్, భారత్
19. ఫోర్ట్‌వార్త్ యూఎస్‌ఏ
20. లఖ్‌నవూ, భారత్
ఈ జాబితా రూపొందించడం కోసం సంస్థ విశ్లేషకులు ఇన్‌స్ట్రాగ్రామ్, కృత్రిమ మేధను ఉపయోగించారు. వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఇల్లు కొనుగోలు చేసిన వారికి సంబంధించి జియోట్యాగింగ్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ సెల్ఫీ ఫొటోలను సేకరించి కృత్రిమ మేధ సాయంతో విశ్లేషించారు. సాధారణ ఇన్‌స్టా యూజర్ ముఖంలోని సంతోషాన్ని, వీరి ముఖంలో ఉన్న సంతోషాన్ని పోల్చి చూశారు. అందులో ఉన్న వ్యత్యాసం ఆధారంగా ఈ జాబితాను రూపొందించి విడుదల చేశారు. ఇదే కాదండోయ్.. టాప్ 20 అతితక్కువ ఆనంద నగరాల జాబితానూ వీరు తయారు చేశారు. అందులోనూ భారత్‌కు చెందిన రెండు నగరాలు ఉన్నాయి. ఈ జాబితాలో తొలిస్థానం ముంబయి నగరానిది కాగా.. ఐదో స్థానంలో సూరత్ ఉంది. ఆఖరి స్థానం యూఎస్‌లోని ఫీనిక్స్‌ది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా
-
India News
Kerala: మహిళల వేషధారణలో పురుషుల పూజలు
-
World News
Injury: గాయం ‘స్మార్ట్’గా మానిపోతుంది
-
Politics News
Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్: ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి