Putin Feces: పుతిన్ మల మూత్రాలను సేకరించి.. ప్రత్యేక సూట్‌కేస్‌లో భద్రపరిచి..!
రష్యా అధ్యక్షుడు పుతిన్ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన మల మూత్రాలను సేకరించి, మాస్కోకు తీసుకెళ్లి పడవేస్తారనే ఆశ్చర్యకరమైన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల తాజా నివేదిక
మాస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎంతోకాలంగా కథనాలు వెలువడుతోన్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ బారినపడ్డారని ఒకసారి, పార్కిన్సన్తో బాధపడుతున్నారని మరోసారి.. ఇలా రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు చిక్కకుండా క్రెమ్లిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో పర్యటించినప్పుడు పుతిన్ మల మూత్రాలను సేకరించి, మాస్కోకు తీసుకెళ్లి పడవేస్తారనే ఆశ్చర్యకరమైన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బాడీగార్డ్ పనిచేస్తారని తాజా నివేదిక వెల్లడించింది.
బయటపెట్టిన జర్నలిస్టులు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన మల మూత్రాలను సేకరించి స్వదేశానికి తీసుకెళతారని తాజా నివేదిక వెల్లడించింది. రష్యా కార్యకలాపాలపై సుదీర్ఘకాలంపాటు వార్తలు సేకరించిన ఇద్దరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఈ విషయాన్ని బయటపెట్టారు. రష్యాపై రెండు పుస్తకాలు రాసిన రెజిస్ జింటేతో పాటు 13ఏళ్లపాటు రష్యా వార్తలను కవర్ చేసిన మిఖైల్ రూబిన్ రాసిన తాజా వ్యాసం ఫ్రెంచ్ న్యూస్ మ్యాగజైన్ ‘ప్యారిస్ మ్యాచ్’లో ప్రచురితమైంది. వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్య రహస్యాలు విదేశీ గూఢచారులకు చిక్కకుండా ఉండేందుకే క్రెమ్లిన్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందని తాజా నివేదిక పేర్కొంది.
ప్రత్యేక ఏజెంట్..
ఫ్రెంచ్ న్యూస్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, వ్లాదిమిర్ పుతిన్ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన రక్షణ బాధ్యత ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ నిర్వహిస్తుంది. పుతిన్‌తోపాటు ఇతర ప్రభుత్వ అధికారుల సంరక్షణనూ ఈ ఎఫ్‌పీఎస్ చూసుకుంటుంది. పుతిన్ మల విసర్జనకు వెళ్లిన ప్రతిసారి ఓ ఎఫ్ఎస్ఓ ఏజెంట్ (ఫెడరల్ గార్డ్ సర్వీస్) వాటిని సేకరించి ఓ ప్రత్యేకమైన ప్యాకెట్లో భద్రపరుస్తారు. అనంతరం వాటిని ఓ సూట్‌కేసులో ఉంచి రష్యాకు తీసుకెళ్తారు. 2019 మే నెలలో ఫ్రాన్స్ పర్యటన, 2019 అక్టోబర్‌లో సౌదీ అరేబియాలో పర్యటించిన సందర్భాల్లో పుతిన్ విసర్జనాలను సేకరించినట్లు సమాచారం. 2019లో ఫ్రాన్స్‌లో పర్యటన సమయంలో పుతిన్ బాత్రూమ్కు వెళ్లినప్పుడు ఆయన వెంట ఆరుగురు బాడీగార్డులు తోడుగా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి చిన్న సూట్‌కేసును తీసుకొని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు ఉన్న ఓ వీడియోను ఒక జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
గతంలోనూ ప్రయత్నాలు..
మరోవైపు కీలక వ్యక్తుల మలమూత్రాలతో వారి ఆరోగ్య రహస్యాలపై గూఢచర్యానికి పాల్పడే ప్రయత్నాలు ఎంతో కాలంగా సాగుతున్నాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పుతిన్ మలమూత్రాలను సేకరించే అంశం ఎప్పటినుంచో కొనసాగుతోందని పలువురు జర్నలిస్టులు గుర్తుచేస్తున్నారు. వియన్నా పర్యటన సందర్భంగా ఇటువంటి ఘటన చోటుచేసుకున్న విషయాన్ని ఫరీదా రుస్తమోవా అనే జర్నలిస్టు గుర్తుచేశారు. చైనా నేత మావోతోపాటు ఇతర ఉన్నతాధికారుల గురించి తెలుసుకునేందుకు వారి మలాన్ని విశ్లేషించి సోవియట్ యూనియన్ అధినేత జోసెఫ్ స్టాలిన్ గూఢచర్యానికి ప్రయత్నించినట్లు మాజీ సోవియట్ ఏజెంట్ ఒకరు 2016లో వెల్లడించారు. కోల్డ్‌వార్ సమయంలో తూర్పు జర్మనీలో సోవియట్ బలగాలు ఉపయోగించిన టాయిలెట్ పేపర్లను బ్రిటిష్ నిఘా సంస్థలు జల్లెడ పట్టాయనే వాదన ఉంది. ఈ విషయాన్ని వెల్లడించిన బ్రిటిష్ సైనిక నిపుణులు టోని గెరాగ్టీ.. అందుకే సోవియట్ సైన్యానికి టాయిలెట్ పేపర్లను ఇవ్వరని పేర్కొన్నాడు.
డీఎన్ఏ, మలవిసర్జనాల భయం..
గూఢచర్యానికి సంబంధించి మలమూత్ర విసర్జన, డీఎన్ఏ వంటి కీలక విషయాల్లో కొందరు దేశాధినేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల రష్యా పర్యటన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను డీఎన్ఏ తస్కరణ భయం వెంటాడిన విషయం తెలిసిందే. అందుకే కొవిడ్ టెస్టు చేస్తామన్న రష్యా అధికారుల అభ్యర్థనను తిరస్కరించిన ఆయన.. ఒకవేళ కొవిడ్ పరీక్షకు నమూనా ఇస్తే రష్యా వైద్యులు డీఎన్ఏను తస్కరిస్తారనే భయంతోనే అందుకు నిరాకరించినట్లు సమాచారం. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సమయంలోనూ 20 అడుగుల దూరంలో కూర్చొని ఆయన చర్చలు జరిపారు. అంతేకాకుండా కనీసం మర్యాదపూర్వకంగా ఇరువురు నేతలు చేతులు కూడా కలపకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్‌స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్‌టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్‌లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్‌కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్‌లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్‌సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్‌పేయీ, కమల్‌నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్‌ఫ్లిక్స్‌కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్‌కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్‌రెడ్డి