Twitter: ట్విటర్ అకౌంట్ ఎందుకు సస్పెండ్ అవుతుంది?
ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సోషల్‌మీడియాను వేదికగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ట్విటర్ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ట్విటర్ అకౌంట్లు సస్పెండ్‌కు గురవుతున్నాయి. ఎందుకలా? దీనికి దారితీస్తున్న కారణాలేంటి?
నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..
నెటిజన్లు వర్తమాన వ్యవహారాలపై ట్విటర్ వేదికగా చర్చిస్తుంటారు. కానీ, ఈ మధ్య అదే ట్విటర్ వార్తల్లోకి ఎక్కి చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థను ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తానని ప్రతిపాదించిన దగ్గర నుంచి దాన్ని సొంతం చేసుకొని తీసుకుంటున్న నిర్ణయాల వరకు అన్నీ వివాదాస్పదమై.. వార్తల్లో నిలిచాయి. మరోవైపు ట్విటర్ అకౌంట్ల సస్పెన్షన్‌పై కొంతకాలంగా పెద్ద రగడే కొనసాగుతోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీనికి గల కారణం ఏంటీ..?
ఒకప్పుడు ప్రముఖులు మాత్రమే ఎక్కువగా ఉపయోగించే ట్విటర్.. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను, భావాలను ట్విటర్ వేదికగా వ్యక్తపరుస్తున్నారు. చాలా మందికి ఈ సోషల్‌మీడియా వేదికలో ఖాతా ఉంటుంది. కానీ, ఒక్కోసారి కొందరి అకౌంట్లు సస్పెండ్ అవుతుంటాయి. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కొందరు భాజపా నేతలు, తాజాగా ‘కాంతార’ నటుడు కిశోర్ ట్విటర్ ఖాతాలను నిలిపివేశారు.
ఎవరిదైనా అకౌంట్ సస్పెండ్ అయిందంటే.. వారు ట్విటర్ పాలసీని ఉల్లంఘించారని, లేదా యూజర్ అకౌంట్‌కు సంబంధించి భద్రతా లోపాలు బయటపడ్డాయని అర్థం. అసలు ఖాతా సస్పెండ్‌కు దారితీసే కారణాలేవో ఓసారి చూద్దాం..
►⇒ చాలా వరకు సస్పెండ్‌కు గురయ్యే అకౌంట్లు ఫేక్ లేదా స్పామ్ అయి ఉంటాయి. అలాంటి అకౌంట్లు ట్విటర్ యూజర్ల భద్రతను ప్రమాదంలోకి నెట్టే అవకాశముంది. అందుకే అలాంటి అకౌంట్లను సంస్థ సస్పెండ్ చేస్తుంటుంది.
⇒ ఖాతా హ్యాక్‌కి గురైనా లేదా వ్యక్తిగత వివరాలు లీక్ అయినా యూజర్ భద్రతా కారణాల దృష్ట్యా అకౌంట్ సస్పెండ్ అవుతుంది. ముప్పు తొలగిన తర్వాత మళ్లీ అకౌంట్‌ను పునరుద్ధరిస్తారు.
►⇒ ఇతరులను జాతి, జాతీయత, ప్రాంతీయత, కులం, లింగ బేధం, వయసు, వైకల్యం, తీవ్ర వ్యాధుల గురించి ప్రస్తావిస్తూ కించపరచడం/బెదిరింపు/వేధించే విధంగా ట్వీట్లు చేసినా.. వారి అకౌంట్‌ను సస్పెండ్ చేస్తారు. అలాగే, కావాలని వేరొకరి పేరుతో ఖాతా తెరిచి.. వారిలా అనుకరించినా, వారి వ్యక్తిగత సమాచారం బయటపెట్టినా అకౌంట్‌ను నిలిపివేస్తారు.
►⇒ ట్విటర్‌లో హింసాత్మక, అభ్యంతరకర వీడియోలు షేర్ చేసినా అకౌంట్ సస్పెండ్ అవుతుంది.
►⇒ ఆత్మహత్యకు ప్రేరేపించే కంటెంట్, తమకు తాము గాయపర్చుకునే వీడియోలను ట్విటర్‌లో పంచుకున్నా.. ఆయా ఖాతాలను ట్విటర్ నిలిపివేస్తుంది.
►⇒ ట్విటర్‌ను అక్రమ వస్తువుల్ని అమ్మడానికి లేదా కొనడానికి.. చట్టవిరుద్ధ పనులకు ఉపయోగిస్తే అకౌంట్‌ను ఆపేస్తారు.
►⇒ ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ట్విటర్ వేదికగా ఏ రకంగా ప్రోత్సహించినా వారి ఖాతాను సస్పెండ్ చేస్తారు.
►⇒ చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి ఎలాంటి కంటెంట్‌నైనా ట్విటర్ ఉపేక్షించదు. అలాంటి వాటిని పోస్ట్ చేసినా, షేర్ చేసినా వారి అకౌంట్లు సస్పెండ్ అవుతాయి.
యూజర్ల యాక్టివిటిని ఎప్పటికప్పుడు గమనించే ట్విటర్.. తమ పాలసీని ఉల్లంఘించిన వారి అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. అలాగే, యూజర్లు ఇలాంటి ఖాతాను రిపోర్టు చేస్తే.. పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. అందుకే ట్విటర్‌ను వినియోగించేటప్పుడు పై విషయాలను గుర్తుంచుకోవడం మంచిది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ts News: గుజరాత్లో పంచాయితీ సర్వీస్ పరీక్ష పేపర్ లీక్.. హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్టు
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Babar: విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్
-
Movies News
Samantha: తన బెస్ట్ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన సమంత
-
Politics News
BRS: సమరానికి సై.. పార్లమెంట్లో భారాస వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత