మనసున్న మారాజు ఈ డాక్టర్.. ఆడపిల్ల పుడితే పైసా తీసుకోడు!
మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన ఓ డాక్టర్(Doctor) తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఆయన సంకల్పానికి ఓ ముగ్గురు మహిళలు అండగా నిలుస్తున్నారు.
(Image : Twitter)
ఆ డాక్టర్ (Doctor) ఓ గైనకాలజిస్ట్. ఆడపిల్లలంటే ఆయనకు ప్రాణం. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ముఖం చిట్లించే వారిని తన సర్వీసులో ఎంతో మందిని చూశారు. కానీ, ఆయనకు మాత్రం అమ్మాయి అంటే ‘లక్ష్మీదేవి’తో సమానం. అందుకే తన ఆస్పత్రి (Hospital)లో ఆడపిల్ల పుడితే పైసా తీసుకోడు. అంతటి గొప్ప మనసున్న డాక్టర్ ఎక్కడున్నారు? ఆయన లక్ష్యానికి వేర్వేరు మతాలకు చెందిన మహిళలు ఏ విధంగా సహకరిస్తున్నారో చదివేయండి.
‘మ్యాడ్’ డాక్టర్ అన్నారు!
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగలాగే మహారాష్ట్ర (Maharashtra)లో గుడిపడ్వా జరుపుకొంటారు. 2007లో సరిగ్గా అదే పండగ రోజున హడాప్సర్ పట్టణంలో మెడికేర్ హాస్పటల్‌ను ప్రారంభించారు డా.గణేశ్ రాఖ్. తన ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న వారికి ఆడపిల్ల పుడితే పైసా తీసుకోకూడదని ఆయన 2012లో నిర్ణయించుకున్నారు. నిన్నటి ఉగాదితో ఆ గొప్ప సంకల్పానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 2470 ఉచిత డెలివరీలు చేసిన ఆయన.. ఏ రూపంలోనూ పైసా తీసుకోలేదు. ఆస్పత్రిలో ఓపీ మొదలుకొని డెలివరీ వరకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ ఖర్చులేకుండా సమకూర్చారు.
ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం అని ప్రకటించగానే మొదట్లో గణేశ్ రాఖ్‌ను కొందరు ‘మ్యాడ్ డాక్టర్’ అని పిలిచారు. అలా విమర్శించిన నోళ్లే ఇప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ వైద్యుడి సేవ మెచ్చి ఇతర వైద్యులు, నర్సులు తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. గణేశ్ రాఖ్ కీర్తి ఖండాంతరాలకు వ్యాపించడంతో అనేక దేశాల నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ‘సేవ్ గర్ల్ చైల్డ్’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరుపై డా.గణేశ్ రాఖ్ త్వరలో అక్కడ ప్రసంగించనున్నారు.
జనహితమే తమ అభి‘మతం’
గణేశ్ రాఖ్ ఉచితంగా వైద్యం అందించడం వెనుక ముగ్గురు మహిళల పరోక్ష సహకారం ఉంది. వారే ఆస్పత్రి భవన యజమానులు. ముగ్గురూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందినవారు. గణేశ్ చేస్తున్న మంచి పనికి సహకారం అందించేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. అతి తక్కువ, నామమాత్రపు అద్దె మాత్రమే తీసుకొంటున్నారు. మొదటి భవనం యజమాని పేరు షగుఫ్తా ముస్తఫ్‌ఖాన్. ఈమె భర్త ఓ ట్యాంకర్ డ్రైవర్. రెండో భవనం యజమాని అనురాధ సదాశివ్ గోపాలె. ఈమె భర్త ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు. ఈయనే గణేశ్‌కు బాల్యంలో ఇంగ్లిష్ బోధించారు. ఎప్పుడైనా అద్దె ఆలస్యం అయితే ఉపాధ్యాయుడిలాగా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తూ గణేశ్‌పై ఒత్తిడి తెస్తారు. ఆ సమయంలో ఆయన భార్య అనురాధ తన వైపు అండగా నిలవడంతో ఆయన వెనక్కి తగ్గుతుంటారని డాక్టర్ ఓ సందర్భంలో వివరించారు. మూడో భవనం యజమాని జెన్నిఫర్ ఎరిక్ మనేజెస్. ఈమె భర్త పారా గ్లైడింగ్ పైలట్. ఆస్పత్రిని విస్తరించే క్రమంలో ఈ మూడు భవంతులను డాక్టర్ అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుత అవసరాలు తీర్చడం కోసం ఆ మూడు భవనాలను కలిపి ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై