Britain : బ్రిటన్‌లో రాజు ఒక్కడే.. పుట్టిన రోజులు రెండు!
ఎవరికైనా పుట్టిన రోజు (Birth day) ఒకటే ఉంటుంది. కానీ, బ్రిటన్ రాజుగా (British monarch) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఛార్లెస్ 3 (Charles III) ఈ సారి రెండు పుట్టిన రోజులు జరుపుకోనున్నాడు. ఆ కథేంటో తెలుసుకోండి.
బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 (Charles III) ఈ నెల 17న ‘ట్రూపింగ్ ది కలర్’ (Trooping the Colour) పరేడ్‌లో పాల్గొననున్నారు. చక్రవర్తి అధికారిక పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. నిజానికి ఛార్లెస్ 3 అసలు పుట్టిన రోజు (Birth day) నవంబర్ 14న. మరి ముందుగానే ఈ పుట్టినరోజు వేడుక ఎందుకు నిర్వహిస్తున్నారో పరిశీలించండి.
బ్రిటన్ రాజు రెండు పుట్టిన రోజులు చేసుకోవడానికి గల కారణం అక్కడి వాతావరణమేనట. 1748లో రాజుగా ఉన్న జార్జ్ 2 పుట్టిన రోజు నవంబర్‌లో వచ్చింది. ఆ సమయంలో బాగా వర్షాలు పడుతున్నాయి. దాంతో తన పుట్టిన రోజు పరేడ్‌కు ఆటంకం కలుగుతుందని ఆయన భావించారు. పరిష్కారంగా ‘ది ట్రూపింగ్ కలర్’ పేరిట రెండో పుట్టిన రోజుకు శ్రీకారం చుట్టారు. జూన్ నెలలో ఎండ కాస్తూ.. ఆకాశం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ నెలలో చక్రవర్తి అధికారిక పుట్టినరోజు నిర్వహించి సైనిక పరాక్రమాన్ని, రాచరిక ఆడంబరాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా సుమారు 1400 మంది సైనికులు, 200 గుర్రాలు, 400 సంగీతకారులతో ఊరేగింపు జరుగుతుంది.
అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ప్రస్తుత రాజు ఛార్లెస్ 3 పాటిస్తున్నారు. జూన్ 17న ఆయన అధికారిక పుట్టిన రోజు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రోజున సైనికులు గుర్రాలతో అద్భుతమైన కవాతు నిర్వహిస్తారు. బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి హార్స్ గార్డ్స్ పరేడ్ వరకు కవాతు సాగుతుంది. ఈ సందర్భంగా రాజ కుటుంబీకులు గుర్రపు బగ్గీల్లో ప్రయాణిస్తారు. బలమైన సైనిక సంపత్తి, రాజవైభవాన్ని చాటేలా ఈ ప్రదర్శన ఉంటుంది.
కింగ్ ఛార్లెస్ 3.. రెండు పుట్టిన రోజుల సంప్రదాయం రాబోయే తరాలు కొనసాగిస్తాయా లేదా అనే సందేహం ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే భవిష్యత్తులో ప్రిన్స్ విలియం లేదా ఆయన తనయుడు ప్రిన్స్ జార్జ్ రాజుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వీరిలో ప్రిన్స్ జార్జ్ పుట్టిన రోజు జులై 22 కాగా.. ప్రిన్స్ విలియం పుట్టిన రోజు జూన్ 21న. వేసవి కాలంలోనే వీరి పుట్టిన రోజులు వస్తుండటంతో.. వీరు రెండు పుట్టిన రోజులు చేసుకుంటారా లేదా ఒక దానికే పరిమితమవుతారా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్‌పోల్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్
-
BJP: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!