womens day: దశాబ్దాల పోరాటం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానం
ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయమిది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలపడిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..: పోరాడి సాధించుకున్న దినం.. అన్నింటా సాధికారిత దిశగా అడుగులు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానం ఇది.. ‘‘పట్టు విడవకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. దీనిని ఒక రోజులో సాధించలేం..’’ స్వామి వివేకానంద
నిజమే.. మహిళా దినోత్సవాన్ని సాధించుకోవడానికి పలు దేశాల్లోని మహిళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. మహిళలు అంతరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక్క రోజులో సాధ్యం కాలేదు. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయమిది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలిచిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు.
ఆకాశంలో సగం.. అన్నింటా సగం అనే మహిళలకు అన్నిచోట్ల ఇబ్బందులే ఎదురవుతున్నాయి. పురుషాధ్యికత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదు. నాడు చికాగోలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారిపోయింది. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ఈ రోజును ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. రాజకీయాల్లో రిజర్వేషన్, ఆస్తిహక్కు కల్పించినా లైంగిక దాడులు మాత్రం పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ప్రత్యేక దినోత్సవంగా..
మహిళలు తమ బాధలు, సమస్యలను చర్చించుకోవడానికి, నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజును మహిళా దినోత్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో 1908 మే 3న సమావేశం నిర్వహించారు. 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్‌హాగన్‌లో జరిగింది.
ఇది నాంది
అమెరికాలోని కొంతమందితో ప్రేరణ పొందిన జర్మన్ సామ్యవాద లూయీస్ జియట్జ్ మహిళలు ఏటా మహిళాదినోత్సవం నిర్వహించాలని తీర్మానం చేశారు. దీనిని జర్మన్ సామ్యవాది క్లారాజెట్కిన్ సమర్థించారు. 17 దేశాల నుంచి హాజరైన 100 మంది మహిళలు ఓటు, సమానహక్కు సాధించడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని భావించారు. 1911 మార్చి 19న 10 లక్షల మందికి పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఓటుహక్కు, ప్రభుత్వ పదవులు కావాలని డిమాండ్ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు. అమెరికాలో మాత్రం ప్రతి ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913లో తొలిసారిగా రష్యన్ మహిళలు ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని జరిపారు.
1914 మార్చి 8 నుంచి
మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో చేశారు. 1914 నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవాల తీరుతెన్నులు, ఉద్యమాలపై 1980 ప్రాంతంలో చరిత్రకారిణి రినీకోట్ పరిశోధన చేశారు.
మహిళల పోరాటాలు..విజయాలు
* 1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వహించి ఓటుహక్కు కావాలని తీర్మానం చేశారు. 1918లో గానీ మహిళలకు అక్కడ ఓటుహక్కు లభించలేదు.
* 1917లో(గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి8) సెయింట్ పీటర్‌బర్గ్ మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలో ఆహార కొరత నివారించాలని కోరారు. ఆ రోజే వస్త్ర పరిశ్రమలోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరికలను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నినదించారు.
* మార్చి 8న అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెనిక్, అలెగ్జాండర్,కొలెవ్టైల్‌లు వ్లాదిమిర్ లెనిన్‌ను ఒప్పించారు. కానీ అది 1965 నాటి దాకా అమల్లోకి రాలేదు.
* చైనాలో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రకటించినా సగం సెలవు రోజుగా పేర్కొన్నారు.
* 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్సవానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు, ప్రపంచ శాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపువచ్చింది.
* అమెరికా 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది.
మహిళల లక్ష్యాలు
* నాయకత్వం, రాజకీయాల్లో అవకాశాలు
* ఆర్థిక స్వావలంబన
* మహిళలపై హింస నివారణ
* శాంతి, భద్రత
* మానవత్వం
* జాతీయ ప్రణాళిక, పరిపాలనలో సమానత్వం
* యువతకు ప్రాధాన్యం
* దివ్యాంగులైన మహిళలు, బాలికలకు అవకాశాలు
భారత్‌లో మహిళా హక్కుల ఉద్యమం
భారత దేశంలో తొలిసారిగా అహ్మదాబాద్‌లో అనసూయ సారాబాయ్ టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. మహిళలను సంఘటితం చేసిన వారిలో సుశీలా గోపాలన్, విమలా రణదివే, కెప్టెన్ లక్ష్మీసెహగల్, అహల్య రంగ్నేకర్, పార్వతీకృష్ణన్ ఉన్నారు. మహిళల ఉద్యమంతో కార్మికుల పని వేళలు, వేతనాలపై చట్టాలను చేశారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న సరోజినినాయుడు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు.
ఐరాస మహిళా దినోత్సవం ప్రకటనలు
1996 - మహిళల గతం గుర్తించడం, భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేయడం
1997 - మహిళలు- శాంతి
1998 - మహిళలు, మానవహక్కులు
1999 - మహిళలపై హింసలేని ప్రపంచం
2000 - శాంతికి మహిళలను సమన్వయ పర్చడం
2001 - మహిళలు, శాంతి, పోరాటాల నిర్వహణ
2002 - నేటి ఆఫ్గన్ మహిళ, నిజాలు, అవకాశాలు
2003 - లింగ సమానత్వం
2004 - మహిళలు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్
2005 - లింగ సమానత, భద్రమైన భవిష్యత్తు నిర్మాణం
2006 - మహిళలు, నిర్ణయాలు
2007 - మహిళలు, బాలికలపై హింసలో శిక్ష తప్పించుకోకుండా చూడడం
2008 - మహిళలు, అమ్మాయిలు, పరిశోధన
2009 - మహిళలపై హింసకు వ్యతిరేకం
2010 - సమాన హక్కులు. సమాన అవకాశాలు
2011 - మహిళలు పని చేసేందుకు అవకాశాలు, విద్య, శిక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోకి ప్రవేశం
2012 - గ్రామీణ మహిళల సాధికారిత, పేదరికం, ఆకలి నిర్మూలన
2013 - మహిళలపై హింస నివారణకు కార్యాచరణ
2014 - అన్నింటా మహిళల పురోగతి
2015 - మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడం
2016 - 2030నాటికి అంతరిక్షంలో 50-50, లింగ సమానత్వం
2017 - పని ప్రదేశంలో మహిళలు, 2030కి సమానత్వం
2018 - గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల్లో మార్పు
2019 - మార్పు సాధించేందుకు ప్రయత్నం
2020 - పురుషులతో సమానంగా హక్కులు
2021 - కొవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం
2022 - మహిళల సమానత్వం, కార్యాచరణ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’
-
General News
Hyderabad: తెలంగాణలో కర్ఫ్యూ లేని పాలన .. ఆ ఘనత పోలీసులదే: ఎమ్మెల్సీ కవిత
-
Movies News
Telugu Indian Idol 2: ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విజేత సౌజన్య
-
India News
Mamata Banerjee: ‘మృతుల సంఖ్యలో వాస్తవమెంత? ’
-
Crime News
Hyderabad: ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు