Be happy : అందరూ బాగుండాలి.. అందులో నువ్వుండాలి!
ప్రజలు సంతోషంగా ఉంటే ప్రపంచం దశ-దిశ మారిపోతుంది. అందుకే ఇవాళ నిర్వహించుకుంటున్న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’లో అందరూ భాగస్వాములు కావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తోంది.
ప్రతి రోజూ ఆనందం(Happy)గా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే దాని కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. అదే ఈ రోజు.. మార్చి 20 ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’(world happiness day). దేశంలో ప్రతి మనిషి సంతోషంగా జీవిస్తేనే ఆర్థిక రంగం పురోగమిస్తుంది.
అట్టడుగున మన ‘హ్యాపీ’
ఇటీవలే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ విడుదలైంది. అందులో 146 దేశాలుంటే.. భారత్(India)కు 136వ ర్యాంకు వచ్చింది. అంటే మన ఆనందం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. మన కన్నా నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు సంతోషంగా ఉన్నట్లు తేలింది. దేశ ప్రజల కొనుగోలు శక్తి, సామాజిక మద్దతు, ఆరోగ్యకర జీవనశైలి, దాతృత్వం, ప్రభుత్వ పాలన, అవినీతి, స్వేచ్ఛ తదితర అంశాలను వడపోసి ఈ హ్యాపీనెస్ ఇండెక్స్‌ను తయారు చేశారు. ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐలాండ్, నెదర్లాండ్ తొలి ఐదు స్థానాల్లో నిలవగా.. తాలిబన్ల పాలనలో మగ్గుతున్న అఫ్గాన్ ఆఖరిస్థానంలో నిలిచింది. మొత్తానికి పశ్చిమ దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాలు ఏ మాత్రం సంతోషంగా లేవని తేలింది.
కారణం ఏంటి?
మన దేశ ప్రజల్లో దీర్ఘకాలిక అసంతృప్తి ఉందట. ఎన్నేళ్లయినా ధనవంతులు మాత్రమే ఎదుగుతున్నారు. పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు. పట్టణీకరణ కారణంగా నగరాల్లో రద్దీ పెరిగింది. జనాభా కూడా పెరిగింది. వైద్య ఖర్చులు ఆకాశన్నంటుతున్నాయి. మహిళలు, మైనారిటీలపై నేరాలు పెరిగిపోయాయి. ఇలాంటి విషయాలన్నీ భారతీయుల అసంతృప్తికి కారణాలు.
అందుకే ఓ రోజు
ప్రపంచంలోని ప్రజలంతా ఒక రోజు ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ ప్రవేశపెట్టారు. సమాజంలో స్ఫూర్తినిచ్చే వ్యక్తులు మిగతా వారిలో సానుకూలతలు పెంచడం, ప్రతి దేశం తమ పౌరులు ఆనందంగా ఉండేలా చూసుకోవడం ఈ రోజు ముఖ్య లక్ష్యం. దురదృష్టవశాత్తూ ఆనందానికి బదులు ప్రపంచంలో కోపం, బాధ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఏటా మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’(world happiness day) నిర్వహిస్తోంది. సంతోషంగా ఉండటమే మానవుని ప్రాథమిక లక్ష్యం అని, వేడుక చేసుకోవడం ద్వారా ఆనందాన్ని పెంపొందించుకోవచ్చని ఈ రోజును కేటాయించింది.
నిజానికి ఒక రోజంతా నవ్వుతూ, మంచి వాతావరణంలో గడిపితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. 2013లో ఐక్యరాజ్యసమితి తొలిసారి ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ నిర్వహించింది. సలహాదారు జేమీ ఇలియన్ ఈ ఐడియాను ప్రవేశపెట్టాడు. వివిధ దేశాలు ‘క్యాప్టలిజం’కు బదులు ‘హ్యాపీటలిజం’పై దృష్టి కేంద్రీకరిస్తే ఆర్థిక వృద్ధి సాధించవచ్చని ఆయన భావించారు. దానికి ఐక్యరాజ్య సమితి కూడా సమ్మతి తెలిపింది. ‘యాక్షన్ ఫర్ హ్యాపీనెస్’, ‘హ్యాపీనెస్‌డే.ఓఆర్‌జీ’ వంటి వివిధ రకాల సంస్థలు దీనికి సహకారం అందించడంతో అది కార్యరూపం దాల్చింది. ఈ వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు ఏ పరిస్థితుల్లో తాము సంతోషంగా ఉంటామో వెల్లడిస్తారు. తమ సంతోషంలో చుట్టుపక్కలి వారిని ఎలా భాగస్వాముల్ని చేస్తారో చెబుతారు. అలా చేయడంతో మంచి భవిషత్తు ఎలా సొంతమవుతుందో వివరిస్తారు.
సంతోషంగా ఎలా గడపాలి?
సంతోషం అంటే ఏమిటో చెప్పమంటే మనలో చాలా మందికి కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం. మన జీవితం ఎంత సంతోషంగా సాగిపోతోందీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఏది ఆనందంగా ఉంచుతుందో ఆ విషయాలను మీ సన్నిహితులతో పంచుకోవాలి. అందుబాటులో ఉన్న ప్రతి వస్తువును చూసి దాన్ని సంపాదించుకున్నందుకు గర్వపడాలి. దాన్ని సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకోవాలి. చిన్నవైనా సరే అవి ఇచ్చిన ఆనందం అద్భుతంగా ఉంటుంది. అలా చేయడం వల్ల జీవితంలో ఎంత సంతృప్తిగా ఉన్నామనే విషయం తెలుస్తుంది.
ఎవరిదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు ఉంటే వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. మీరు చేసే చిన్న ఆత్మీయ పలకరింపు లేదా ఒక సందేశంతో ఇంకొకరి ముఖంలో చిరునవ్వుని వెలిగించవచ్చు. మంచి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండటం కూడా సంతోషాలకు మూల కారణం. అందుకే మనకు ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సేపు గడపాలి. వారితో మనకున్న బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. సంతోషానికి దారి తీసే వాటిలో నిద్ర కూడా ఒక భాగం. అందుకే త్వరగా పడుకుంటే ఎక్కువ సేపు నిద్రపోవచ్చు. దాంతో మరుసటి రోజంతా హుషారుగా గడపొచ్చు. వ్యక్తిగత సంతోషం పెంచుకోవడానికి ఇవి గొప్ప మార్గాలుగా ఉపయోగపడతాయి. ఇలా ఒక్క రోజు చేయడం కాకుండా నిత్యం ఓ అలవాటుగా చేసుకుంటే సంతోషం తప్పకుండా మీ సొంతమవుతుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు