ఏపీలో రేషన్‌ డీలర్ల మెరుపు సమ్మె

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా  రేషన్‌ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు పంపిణీని నిలిపివేస్తున్నట్లు

Updated : 20 Jul 2020 13:16 IST

అమరావతి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వ్యాప్తంగా  రేషన్‌ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పలువురు వినియోగదారులు రేషన్‌ దుకాణాలకు వచ్చి వెనుదిరుగుతున్నారు. కరోనా వారియర్స్‌గా గుర్తించి రేషన్‌ డీలర్లకు బీమా సౌకర్యం కల్పించాలని సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావు కోరారు. రేషన్‌ ఇచ్చే సమయంలో వేలిముద్ర నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఇవాళ్టి నుంచి 8వ విడత రేషన్‌ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన తరుణంలో డీలర్లు సమ్మె ప్రకటించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని