TS:ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక సెల్‌

లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50వేల ఉద్యోగాల భర్తీని త్వరితగతిన చేపట్టేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్...

Published : 18 Dec 2020 01:51 IST

వెల్లడించిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50వేల ఉద్యోగాల భర్తీని త్వరితగతిన చేపట్టేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఛైర్మన్ ఘంటా చక్రపాణి, కమిషన్ సభ్యుల పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి సీఎస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సెల్‌.. టీఎస్‌పీఎస్‌సీతో సమన్వయం చేసుకుంటూ నియామక ప్రక్రియ చేపడుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 50వేల ఉద్యోగాల నియామకాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో ఉన్నామని సీఎస్‌ వివరించారు.

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మర్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రాష్ట్రానికి సేవ చేసే అవకాశం రావడం సంతోషించదగిన విషయమన్నారు. ఇప్పటివరకు చేపట్టిన నియామకాల్లో పారదర్శకంగా, నిజాయతీగా వ్యవహరించామని.. ఆ దిశగా సీఎం కేసీఆర్‌ స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. భర్తీ విషయంలో దేశం మొత్తం టీఎస్‌పీఎస్‌సీ వైపు చూసే విధంగా కమిషన్‌ను తీర్చిదిద్దామన్నారు. కమిషన్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ 35 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ చేపట్టామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని