Telangana News: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దివ్యాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

దివ్యాంగుల దినోత్సవం (డిసెంబరు 3) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇన్నాళ్లు స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేయనుంది.

Published : 03 Dec 2022 01:17 IST

హైదరాబాద్‌: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబరు 3) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది. దివ్యాంగుల సంక్షేమంపై మరింత దృష్టిసారించేందుకు వీలుగా ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమం, సమర్థ సేవలు అందించేందుకు వీలుగా జిల్లాస్థాయిలోనూ మహిళ, శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేశారు. దీనికి జిల్లా సంక్షేమ అధికారిని నియమిస్తారు. మహిళ శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు శాఖాపరమైన ఏర్పాట్లు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని