AP High Court: చంద్రబాబుకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)కు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 10 Jan 2024 15:37 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)కు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు (AP High Court) ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపారు. పిటిషనర్లకు 48 గంటల ముందు నోటీసు ఇచ్చాకే విచారించాలని సీఐడీని ఆదేశించారు.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌), ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్‌ శ్రీనరేశ్‌కూ ముందస్తు బెయిల్‌ మంజూరైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని