Ap News: మాస్క్‌ లేకపోతే జరిమానా.. ప్రచారంపై స్పందించిన ఏపీఎస్‌ఆర్‌టీసీ

బస్సుల్లో మాస్కు ధరించకుంటే జరిమానా ప్రచారంపై ఏపీఎస్ ఆర్‌టీసీ స్పందించింది. జస్సుల్లో మాస్కు లేకుంటే జరిమానా వేయడం లేదని స్పష్టం చేసింది. అయితే బస్సుల్లో

Updated : 11 Jan 2022 06:12 IST

అమరావతి‌: బస్సుల్లో మాస్కు ధరించకుంటే జరిమానా ప్రచారంపై ఏపీఎస్ ఆర్‌టీసీ స్పందించింది. జస్సుల్లో మాస్కు లేకుంటే జరిమానా వేయడం లేదని స్పష్టం చేసింది. అయితే బస్సుల్లో మాస్కు ధరించాలని చెబుతున్నట్లు పేర్కొంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాస్కు ధరించాల్సిందిగా సూచిస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బస్టాండ్లలో మాస్కు లేకుండా తిరుగుతున్న వారికే జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా నో పార్కింగ్‌ జోన్‌లో బైకులు, వాహనాలు నిలిపి ఉంచిన వారికి, బస్టాండ్‌ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న వారికి జరిమానా వేస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో మాస్కులు తప్పక ధరించాలని అవగాహన కల్పిస్తున్నామని ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని