CI Swarnalatha: సీఐ స్వర్ణలత సినీ ప్రేమ.. డ్యాన్స్‌లతో సోషల్‌మీడియాలో హల్‌చల్‌

CI Swarnalatha Dance Videos: సినిమా పాటలకు ఏఆర్‌ సీఐ స్వర్ణలత స్టెప్పులేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వెండితెరపై మక్కువ ఉన్న ఆమె.. ఓ సినిమాలోనూ నటిస్తున్నారు.

Published : 08 Jul 2023 11:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్‌ సీఐ స్వర్ణలత (CI Swarnalatha) అరెస్టు కావడం సంచలనం రేపింది. వృత్తిలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె.. ప్రవృత్తి పరంగా వెండితెరపై మక్కువ పెంచుకున్నారు. సినిమాలపై ఆసక్తి ఉన్న స్వర్ణలత కొంతకాలం క్రితం ఓ పాటకు డ్యాన్స్‌ చేశారు. చిరు ప్రయత్నం అంటూ ఆ వీడియోతో సామాజిక మాధ్యమాల్లో (Viral Videos) హల్‌చల్‌ చేశారు. తాను తీయబోయే సినిమాలో మంచి పాత్ర ఇస్తానని, ఇందుకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండాలని ఓ ప్రజాప్రతినిధి చెప్పడంతో ఒక కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆమె అరెస్టవడంతో యూట్యూబ్‌లో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని