వాక్సిన్‌ తీసుకుంటే మెక్‌డొనాల్డ్స్‌ స్పెషల్‌ ఆఫర్స్‌

కొవిడ్‌ కష్ట కాలంలో ఎవరికి వారు ఎంతో కొంత ఇతరులకు సాయపడటాన్ని చూస్తూనే ఉన్నాం. ఆతిథ్య రంగంలో ముఖ్యంగా హోటల్స్‌, రెస్టారెంట్లు సైతం కొవిడ్‌ మీల్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్స్‌, ఐసోలేషన్‌ సెంటర్లు.. ఇలా మరెన్నో ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలు టీకా

Updated : 21 Nov 2022 16:21 IST

ప్రజల్లోకి టీకా ప్రాముఖ్యత తెలిపేందుకే ఇలా!

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ కష్ట కాలంలో ఎవరికి వారు ఎంతో కొంత ఇతరులకు సాయపడటాన్ని చూస్తూనే ఉన్నాం. ఆతిథ్య రంగంలో ముఖ్యంగా హోటల్స్‌, రెస్టారెంట్లు సైతం కొవిడ్‌ మీల్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్స్‌, ఐసోలేషన్‌ సెంటర్లు.. ఇలా మరెన్నో ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలు టీకా తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ తాజాగా మెక్‌డొనాల్డ్‌ ‘వియ్‌ కేర్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీకా తీసుకున్న వారికి ‘లిమిటెడ్‌ టైమ్‌’ పేరుతో మీల్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. తూర్పు, ఉత్తర భారతదేశంలో ఈ సేవలు అందించనున్నారు. మెక్‌డొనాల్డ్‌ యాప్‌లో టీకా తీసుకున్న వారు ధ్రువీకరణ పత్రంతో పాటు ఇతర వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అనంతరం వారికి ఎస్సెమ్మెస్‌ రూపంలో ఒక కోడ్‌ వస్తుంది. దాన్ని గెట్‌మెక్‌డొనాల్డ్‌.కామ్‌లో రీడిమ్ చేసి వారికి నచ్చిన ఆహార పదార్థాలపై ఆఫర్‌ను పొందవచ్చు. ఈ సందర్భంగా కంపెనీ అధికారి రాజీవ్‌రాజన్‌ మాట్లాడుతూ...‘‘ మాహమ్మారి విజృంభణ వేళ వ్యాక్సిన్‌ అనేది ముఖ్య ప్రక్రియ. కలిసి కట్టుగా పనిచేయడమే కాకుండా ఇతరులు సైతం టీకా పొందేలా ప్రోత్సహించే అవసరం ఎంతైనా ఉంది. వినూత్నరీతిలో ఈ గొప్పపని చేసి ప్రజలకు సాయపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’అని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని